Milkha Singh: అర్జున అవార్డు ఎందుకు వద్దన్నాడు? బయోపిక్‌కు పెట్టిన కండిషన్‌ ఏంటంటే..

19 Jun, 2021 09:20 IST|Sakshi

ఒలంపిక్స్‌, కామన్‌వెల్త్‌, ఏషియన్‌ గేమ్స్‌లో పరుగు పందేలతో, పతకాలతో దేశ ప్రతిష్టను పెంచిన దిగ్గజం మిల్కా సింగ్‌. పోస్ట్‌ కొవిడ్‌ సంబంధిత సమస్యలతో 91 ఏళ్ల వయసున్న ఆయన కన్నుమూయగా..  క్రీడా లోకం, దేశం ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తోంది. అయితే ఈ పరుగుల దిగ్గజం గురించి అతితక్కువ మందికి తెలిసిన విషయాలెంటో చూద్దాం.

  • 1929 నవంబర్‌ 20న గోవింద్‌పుర(ప్రస్తుతం పాక్‌లో ఉన్న పంజాబ్‌)లో పుట్టిన మిల్కా సింగ్‌.. విభజన అల్లర్లలో తల్లిదండ్రుల్ని పొగొట్టుకున్నాడు.
  • బలవంతంగా శరణార్థ శిబిరాల్లో గడిపిన మిల్కా.. చివరికి 1947లో ఢిల్లీలో ఉంటున్న తన సొదరి దగ్గరికి చేరుకున్నాడు. 
  • ఆ టైంలో టికెట్‌ లేకుండా ప్రయాణించిన నేరానికి కొన్నాళ్లు తీహార్‌ జైలులోనూ గడిపాడాయన.
  • అల్లర్లలో తల్లిదండ్రుల్ని కోల్పోవడం, చేదు అనుభవాలు తన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీశాయని, ఒకానొక టైంలో దొపిడీ దొంగగా మారాలని అనుకున్నాడని ఆయన తరచూ ఇంటర్వ్యూలలో చెప్తుండేవాడు.

 

  • అయితే సోదరుడి ప్రోత్సాహంతో ఆర్మీలో చేరి.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ‘పరుగులు’ తీశాడు
  • ఇండియన్‌ ఆర్మీ పరీక్షల్లో మూడుసార్లు విఫలమైన మిల్కా సింగ్‌.. 1951 నాలుగో అటెంప్ట్‌లో సెలక్ట్‌ అయ్యాడు. 
  • ఆర్మీలో టెక్నికల్‌ జవాన్‌గా మిల్కా సింగ్‌ ప్రస్థానం మొదలైంది. అయితే అక్కడి నుంచే ఆయన రన్నింగ్‌ రేసుల్లో పాల్గొనేవాడు. 
  • మన దేశంలో రన్నింగ్‌లో ‘ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌’ను ఇంట్రడ్యూస్‌ చేసింది మిల్కా సింగే. 
  • కామన్‌వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం గెలిచిన తర్వాత.. తన విజయానికి గౌరవంగా దేశవ్యాప్త సెలవు ప్రకటించాలన్న మిల్కా సింగ్‌ విజ్ఞప్తిని అప్పటి ప్రధాని నెహ్రూ సంతోషంగా అంగీకరించారు.

  • 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో నాలుగో స్థానంలో నిలిచాడు మిల్కా సింగ్‌. అయితే అప్పుడు ఆయన నెలకొల్నిన 45 సెకన్ల రికార్డు బ్రేక్‌ చేయడానికి మరో భారత రన్నర్‌కి 40 ఏళ్లు పట్టింది.
  • ఆసియా పరుగుల వీరుడి ట్యాగ్‌ దక్కించుకున్న అబ్దుల్‌ ఖలిక్‌పై 200 మీటర్లపరుగుపందెంలో విజయం సాధించాడు మిల్కా సింగ్‌. అది చూసి పాక్‌ జనరల్‌ ఆయూబ్‌ ఖాన్‌ ‘ఫ్లైయింగ్‌ సిక్‌’ అని పిలిచాడు. అప్పటి నుంచి అది ఆయన బిరుదు అయ్యింది. 
  • మొత్తం 80 రేసుల్లో 77 విజయాలతో అరుదైన రికార్డు ఆయన సొంతమని చెప్తారు. 

  • 2001లో కేంద్రం ఆయనకు అర్జున అవార్డు ప్రకటించగా.. ‘40 ఏళ్లు ఆలస్యమైంద’ని పేర్కొంటూ ఆయన తిరస్కరించారు. 
  • ఆయన తన పతకాలన్నింటిని దేశానికే దానం చేశాడు. తొలుత ఢిల్లీ నెహ్రూ స్టేడియంలో ప్రదర్శనకు ఉంచిన వాటిని.. తర్వాత పటియాలాలోని స్పోర్ట్స్‌  మ్యూజియానికి తరలించారు. 
  • 1999లో కార్గిల్‌ వార్‌లో అమరుడైన బిక్రమ్‌ సింగ్‌ ఏడేళ్ల కొడుకును మిల్కా సింగ్‌ దత్తత తీసుకున్నాడు

మిల్కా సింగ్‌ తన కూతురు సోనియా సాన్వాకాతో కలిసి ఆత్మకథ ‘ది రేస్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ రాసుకున్నాడు. ఈ బుక్‌ ఆధారంగానే బాలీవుడ్‌ డైరెక్టర్‌ రాకేష్‌ మెహ్రా, ఫర్హాన్‌ అక్తర్‌ను లీడ్‌ రోల్‌ పెట్టి ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ సినిమా తీశాడు. అయితే ఈ సినిమా కోసం తన బయోపిక్‌ హక్కుల్ని ఒక్క రూపాయికే ఇచ్చేసి ఆశ్చర్యపరిచాడు ఈ దిగ్గజం. కానీ, సినిమాకొచ్చే లాభాల్లో కొంత వాటాను పేద క్రీడాకారుల కోసం నెలకొల్పిన మిల్కా సింగ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌కి ఇవ్వాలనే కండిషన్‌ పెట్టాడనే విషయం తర్వాత వెలుగులోకి వచ్చింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: మిల్కా సింగ్‌ భార్య నిర్మల్‌ కౌర్‌ కన్నుమూత 

మరిన్ని వార్తలు