Mitchell McClenaghan: 72 గంటలు కాలేదు.. భారత్‌- న్యూజిలాండ్‌ సిరీస్‌ 'మీనింగ్‌లెస్‌'

20 Nov, 2021 19:50 IST|Sakshi

Mitchell McClenaghan Criticize IND vs NZ T20 Series.. టీమిండియా- న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న టి20 సిరీస్‌ అర్థం లేనిదని ఆ జట్టు పేసర్‌ మిచెల్‌ మెక్లీన్‌గన్‌ విమర్శించాడు. టీమిండియాతో జరిగిన రెండు టి20ల్లోనూ ఓటమిపాలైన న్యూజిలాండ్‌ 2-0తేడాతో ఒక మ్యాచ్‌ మిగిలిఉండగానే అప్పగించింది. కాగా ట్విటర్‌లో అభిమానుల సంధించిన ప్రశ్నకు మెక్లీన్‌గన్‌ స్పందించాడు.

''టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌ ముగిసిన 72 గంటల్లోనే సిరీస్‌ జరపడం వ్యర్థమైన పని.  ఒక మేజర్‌ టోర్నీ ఆడి ఇరు జట్లు అలిసిపోయాయని.. అందునా కివీస్‌ ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌ ఓడి నేరుగా భారత్‌కు చేరుకుంది. కనీస విశ్రాంతి లేకుండానే బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసి టి20 సిరీస్‌ను భారత్‌కు అప్పగించింది. నాకు తెలిసి టి20 ప్రపంచకప్‌ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ మరొక సిరీస్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. ఇరుబోర్డులు ముందు ప్లాన్‌ చేసుకోవాల్సింది. ఒక్కో సిరీస్‌కు కనీసం 10 రోజులు గ్యాప్‌ ఉండేలా చూసుకోవాలి. ఇలా అర్థంతరంగా సిరీస్‌ నిర్వహించడం కరెక్ట్‌ కాదు.'' అని చెప్పుకొచ్చాడు. ఇక కివీస్, టీమిండియాల మధ్య మూడో టి20 ఆదివారం(నవంబర్‌ 21) జరగనుంది.

చదవండి: Rohit Sharma: టీ20ల్లో అరుదైన రికార్డు సాధించిన రోహిత్‌ శర్మ..

Martin Guptill: కోహ్లి రికార్డు బద్దలు .. టి20 చరిత్రలో తొలి బ్యాటర్‌గా గప్టిల్‌

మరిన్ని వార్తలు