AUS Vs SL: టి20 చరిత్రలో రెండో వేగవంతమైన బంతికి ఔటైన లంక క్రికెటర్‌గా

28 Oct, 2021 22:06 IST|Sakshi

Mitchell Starc Delivers 2nd Fast Ball Dismiss Kusal Perera.. టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, శ్రీలంక మ్యాచ్‌లో కుషాల్‌ పెరీరా ఔటైన విధానం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ అద్భుత యార్కర్‌తో మెరిశాడు. కాగా స్టార్క్‌ యార్కర్‌ డెలివరీకి కుషాల్‌ పెరీరా వద్ద సమాధానం లేకుండా పోయింది. ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. ఓవర్‌ మూడో బంతిని స్టార్క్‌ యార్కర్‌ వేయగా.. కుషాల్‌ పెరీరా ఢిపెన్స్‌ చేయబోయాడు.

చదవండి: IND Vs NZ: కివీస్‌తో మ్యాచ్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌.. టాస్‌ గెలువు కోహ్లి 

కానీ వేగంగా వచ్చిన బంతి పెరీరా కాళ్ల సందుల్లో నుంచి వెళ్లి వికెట్లను గిరాటేశాడు. దీంతో క్లీన్‌బౌల్డ్‌ అయిన కుషాల్‌ నవ్వుకుంటూ పెవిలియన్‌ బాట పట్టాడు. కాగా టి20 క్రికెట్‌ చరిత్రలో రెండో అత్యంత వేగవంతమైన బంతికి(గంటకు 144 కిమీ వేగం) ఔటైన లంక క్రికెటర్‌గా కుషాల్‌ పెరీరా నిలిచాడు. 

చదవండి: Chris Morris: దక్షిణాఫ్రికాతో ఆట ముగిసినట్లే.. క్రిస్‌ మోరిస్‌ ఆవేదన

మరిన్ని వార్తలు