IND vs AUS: టీమిండియాతో తొలి టెస్టు.. ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌! ఇక కష్టమే

31 Jan, 2023 10:23 IST|Sakshi

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు భారత గడ్డపై ఆస్ట్రేలియా అడుగుపెట్టింది. టెస్టు సిరీస్‌ అనంతరం మూడు వన్డేల సిరీస్‌లో కూడా ఆసీస్‌ జట్టు భారత్‌తో తలపడనుంది. ఫిబ్రవరి 9నుంచి నాగ్‌పూర్‌ వేదికగా జరగన్న తొలి టెస్టుతో ఆస్ట్రేలియాతో టీమిండియా పోరు ప్రారంభం కానుంది.

అయితే తొలి టెస్టుకు ముందు ఆసీస్‌ జట్టుకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ గాయం కారణంగా దూరం కానున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో స్టార్క్‌ చేతి వేలికి గాయమైంది. ఈ క్రమంలో అతడు ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. తాజాగా ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డుల్లో స్టార్క్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా స్టార్క్‌ భారత పర్యటన గురుంచి మాట్లాడాడు.

"నేను గాయం నుంచి కోలుకుంటున్నాను. మరో రెండు వారాల్లో పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తా. బహుశా ఢిల్లీ వేదికగా జరగబోయే రెండు టెస్టుకు మా జట్టుతో కలుస్తానని అనుకుంటున్నా. అయితే అప్పటికే మా బాయ్స్‌ తొలి టెస్టులో విజయం సాధిస్తారని భావిస్తున్నాను. భారత్‌కు వచ్చాక నా శిక్షణ మొదలపెడతాను" అని స్టార్క్‌ పేర్కొన్నాడు. మరోవైపు ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్రీన్‌ కూడా తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది.

ఆస్ట్రేలియా భారత పర్యటన షెడ్యూల్‌: ఫిబ్రవరి 09- మార్చి 22
టెస్టు సిరీస్‌తో ప్రారంభం- వన్డే సిరీస్‌తో ముగింపు
నాలుగు టెస్టులు
1. ఫిబ్రవరి 9- 13: నాగ్‌పూర్‌
2. ఫిబ్రవరి 17- 21: ఢిల్లీ
3. మార్చి 1-5: ధర్మశాల
4. మార్చి 9- 13: అహ్మదాబాద్‌

3 వన్డేలు
1. మార్చి 17- ముంబై
2. మార్చి 19- వైజాగ్‌
3. మార్చి 22- చెన్నై

చదవండి: IND vs NZ: బ్యాటర్లకు చుక్కలు చూపించిన లక్నో పిచ్‌.. క్యూరేటర్‌పై వేటు!

>
మరిన్ని వార్తలు