స్మృతి, మిథాలీ ర్యాంక్‌లు యథాతథం 

7 Apr, 2021 09:46 IST|Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు స్మృతి మంధాన, మిథాలీ రాజ్‌ స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు. 710 పాయింట్లతో స్మృతి ఏడో ర్యాంక్‌లో... 709 పాయింట్లతో మిథాలీ ఎనిమిదో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. బౌలింగ్‌ విభాగంలో జులన్‌ గోస్వామి ఐదో ర్యాంక్‌లో, పూనమ్‌ యాదవ్‌ ఎనిమిదో ర్యాంక్‌లో, శిఖా పాండే పదో ర్యాంక్‌లో నిలిచారు. ఆల్‌రౌండర్‌ విభాగంలో దీప్తి శర్మ ఐదో స్థానంలో ఉంది. 

మరిన్ని వార్తలు