Mithali Raj: రిటైర్మెంట్‌ ప్రకటనపై యూ టర్న్‌ తీసుకోనున్న మిథాలీ రాజ్‌..?

25 Jul, 2022 19:38 IST|Sakshi

Mithali Raj: భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ సారధి మిథాలీ రాజ్‌ ఇటీవలే క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె తన రిటైర్మెంట్‌ ప్రకటనపై వెనక్కు తగ్గాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఐసీసీ హండ్రెడ్ పర్సెంట్ క్రికెట్ పోడ్‌కాస్ట్‌లో ఆమె మాట్లాడుతూ.. మళ్లీ మైదానంలోకి దిగుతానంటూ సూచనప్రాయంగా వెల్లడించింది. వచ్చే ఏడాది గనుక మహిళల ఐపీఎల్‌ ప్రారంభమైతే తప్పక తాను బరిలో ఉంటానని పరోక్షంగా పేర్కొంది.

ఐపీఎల్ కోసం ఆ ఆప్షన్‌ను (రీఎంట్రీ) ఎప్పుడూ ఓపెన్‌గా పెట్టుకుంటానని తెలిపింది. ఐపీఎల్‌లో ఆడే అవకాశం వస్తే రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారా అని ఎదురైన ప్రశ్నకు మిథాలీ పైవిధంగా స్పందించింది. కాగా, మహిళల ఐపీఎల్‌ నిర్వహణకు బీసీసీఐ గత కొద్ది కాలంగా భారీ కసరత్తు చేస్తుంది. వుమెన్స్‌ ఐపీఎల్‌ను ఎలాగైనా వచ్చే ఏడాది (2023) ప్రారంభిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా కొద్దిరోజుల కిందట ప్రకటన కూడా చేశారు. మొత్తం 6 జట్లతో మహిళల ఐపీఎల్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. 
చదవండి: Ind Vs WI 2nd ODI: నిరాశకు లోనయ్యాను.. ద్రవిడ్‌ సర్‌ చాలా టెన్షన్‌ పడ్డారు!

మరిన్ని వార్తలు