Mithali Raj Retirement- Records: మిథాలీ రాజ్‌ అరుదైన రికార్డులు ఇవే! ఎవరికీ సాధ్యం కాని రీతిలో

8 Jun, 2022 16:43 IST|Sakshi

Mithali Raj Retirement: భారత క్రికెటర్‌గా దాదాపు 23 ఏళ్ల పాటు కొనసాగించిన ప్రస్థానాని​కి మిథాలీ రాజ్‌ ముగింపు పలికారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. రెండేళ్ల క్రితం పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌ బై చెప్పిన ఆమె.. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించారు. 

కాగా 39 ఏళ్ల మిథాలీ క్రికెటర్‌గా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో రికార్డులు నెలకొల్పారు. అరుదైన రికార్డులతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచి లెజెండ్‌గా ఖ్యాతి గడించారు. మిథాలీ రిటైర్మెంట్‌ సందర్భంగా ఆమె సాధించిన ఘనతల గురించి సంక్షిప్తంగా..

1999లో మిథాలీ రాజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. చివరిసారిగా ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్‌-2022లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు.
వన్డేల్లో అత్యధిక పరుగులు(7805) సాధించిన మహిళా క్రికెటర్‌గా రికార్డు
వన్డే క్రికెట్‌లో అత్యధిక అర్ధ శతకాలు బాదిన మహిళా క్రికెటర్‌గా ఘనత
వుమెన్‌ వరల్డ్‌కప్‌ ఈవెంట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌ జాబితాలో రెండో స్థానంలో మిథాలీ రాజ్‌(1321 పరుగులు)
వన్డేల్లో అత్యధిక సెంచరీలు(7) సాధించిన భారత మహిళా క్రికెటర్‌గా ఖ్యాతి.
టీ20 ఫార్మాట్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో మిథాలీ సాధించిన పరుగులు 2364. 2019లో చివరి మ్యాచ్‌ ఆడిన ఆమె.. టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్‌గా కొనసాగుతున్నారు.

మహిళా క్రికెట్‌లో ఇప్పటి వరకు 10 వేల కంటే ఎక్కువ పరుగులు సాధించిన బ్యాటర్‌గా మిథాలీ. అన్ని ఫార్మాట్లలో కలిపి ఆమె చేసిన పరుగులు 10868.
మహిళా ప్రపంచకప్‌ ఈవెంట్‌లో ఏకంగా ఆరుసార్లు( 2000, 2005, 2009, 2013, 2017, 2022) పాల్గొన్న క్రికెటర్‌గా గుర్తింపు.
మహిళా టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా మిథాలీ. 2002లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 214 పరుగులు సాధించిన మిథాలీ.
మహిళా వన్డే క్రికెట్‌లో అతి పిన్న వయసులో సెంచరీ సాధించిన బ్యాటర్‌గా మిథాలీ రాజ్‌కు పేరు. 16 ఏళ్ల 205 రోజుల వయసులో ఆమె ఈ ఘనత సాధించారు.
మహిళా క్రికెట్‌లో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన క్రికెటర్‌గా మిథాలీ రాజ్‌ అరుదైన రికార్డు. ఆమె 22 ఏళ్ల 274 రోజుల పాటు క్రికెటర్‌గా ఉన్నారు.

మహిళా ప్రపంచకప్‌ టోర్నీలో అత్యధిక సార్లు(12) హాఫ్‌ సెంచరీ ప్లస్‌ స్కోరు చేసిన క్రికెటర్‌గా మిథాలీ(న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ డెబీ హాక్లేతో కలిసి సంయుక్తంగా మొదటి స్థానం).
అదే విధంగా కెప్టెన్‌గానూ  మెగా ఈవెంట్‌లో యాభై కంటే ఎక్కువ పరుగులు సాధించడం ఎనిమిదోసారి.
వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన మహిళా కెప్టెన్‌గా మిథాలీ రికార్డు.
మహిళల క్రికెట్‌లోనే కాకుండా పురుషుల క్రికెట్‌లోనూ ఎవ్వరికీ సాధ్యం కాని అత్యంత అరుదైన రికార్డు మిథాలీ సొంతం. అదేమిటంటే.. ​​​తన కంటే 21 ఏళ్ల చిన్నదైన, తన అంతర్జాతీయ అరంగ్రేటం తర్వాత నాలుగేళ్లకు పుట్టిన రిచా ఘోష్‌తో కలిసి మిథాలీ వరల్డ్‌కప్‌-2022లో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు.

చదవండి: Nicholas Pooran: ఐపీఎల్‌లో పర్లేదు.. అక్కడ మాత్రం తుస్‌! కానీ పాక్‌తో మ్యాచ్‌లో..

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు