టాస్‌ విషయంలో​ ధోని నుంచి చాలా నేర్చుకోవాలి

4 Oct, 2021 16:01 IST|Sakshi

Need to learn from MS Dhoni To Win Toss.. టీమిండియా వుమెన్స్‌ కెప్టెన్‌గా మిథాలీ రాజ్‌ టాస్‌ నెగ్గిన సందర్భాల కంటే ఓడిపోయినవే ఎక్కువగా ఉన్నాయి. మిథాలీకి టాస్‌ విషయంలో ఏ మాత్రం కలిసిరాదని పలుమార్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ఇంగ్లండ్‌తో జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో మిథాలీ టాస్‌ ఓడిపోయింది. దీంతో మ్యాచ్‌ అనంతరం మిథాలీతో జరిగిన ఇంటర్య్వూలో మరోసారి టాస్‌ ప్రస్తావన వచ్చింది. దీనిపై మిథాలీ రాజ్‌ ఫన్నీవేలో స్పందించింది. టాస్‌ ఓడిపోవడం అనేది నా దృష్టిలో పెద్ద విషయం కాదు. అనవసరంగా దీనిని పెద్ద ఇష్యూ చేయడం నాకు ఇష్టం ఉండదు. కాల్‌ చెప్పడం వరకే నా బాధ్యత.. ఆ తర్వాత జరిగేది నా చేతుల్లో ఉండదు. అయితే టాస్‌ గెలవడం విషయంలో ధోని నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది. అని చెప్పుకొచ్చింది. 

చదవండి: Ind-W Vs Aus-W: 30 ఏళ్ల తర్వాత... తొలిసారిగా..

 భారత్, ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్ల మధ్య జరిగిన ఏకైక డే–నైట్‌ ‘పింక్‌ బాల్‌’ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. మూడు దశాబ్దాల విరామం తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌ను భారత్‌ ‘డ్రా’గా ముగించడం విశేషం. మ్యాచ్‌ చివరి రోజు ఆస్ట్రేలియాకు భారత్‌ 272 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 32 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లలో 2 వికెట్లకు 36 పరుగులు చేసింది. ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో మరో 17 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే ఇరు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 143/4తో చివరి రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 96.4 ఓవర్లలో 9 వికెట్లకు 241 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ గురువారం నుంచి మొదలవుతుంది.   

చదవండి: T20 World Cup 2021: హార్దిక్‌ పాండ్యాపై విశ్వాసం ఎక్కువ.. అతన్ని తొలగించరు!

మరిన్ని వార్తలు