INDW Vs PAKW: మిథాలీ రాజ్‌ ప్రపంచ రికార్డు.. తొలి క్రికెటర్‌గా

6 Mar, 2022 12:19 IST|Sakshi

ఐసీసీ మహిళల వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ ప్రపంచ రికార్డు సాధించింది. మౌంట్ మౌన్‌గనుయ్‌ వేదికగా జరగుతోన్న ఈ మ్యాచ్‌తో అత్యధిక వన్డే ప్రపంచకప్‌లు ఆడిన తొలి మహిళా క్రీడాకారిణిగా మిథాలీ నిలిచింది. ఇప్పటి వరకు మిథాలీ రాజ్‌ మొత్తం ఆరు వన్డే ప్రపంచకప్‌లో పాల్గొంది. 2000 వరల్డ్‌కప్‌లో మిథాలీ అరంగేట్రం చేసింది. వరుసగా 2000, 2005, 2009, 2013, 2017, 2022 ప్రపంచకప్‌లలో భారత జట్టుకు మిథాలీ ప్రాతినిధ్యం వహించింది.

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డెబ్బీ హాక్లీ, ఇంగ్లండ్ క్రీడాకారిణి షార్లెట్ ఎడ్వర్డ్స్‌ల రికార్డును మిథాలీ రాజ్‌ బ్రేక్‌ చేసింది. హాక్లీ, ఎడ్వర్డ్స్ వరుసగా ఐదు ప్రపంచకప్‌ల్లో ఆడారు. ఇక ఆరు ప్రపంచకప్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా మిథాలీ రాజ్ సమం చేసింది. వరుసగా 1992,1996,1999,2003,2007,2011 ప్రపంచకప్‌లలో భారత తరుపున సచిన్‌ ఆడారు.

చదవండి: Ravindra Jadeja: జడేజా సరికొత్త రికార్డు.. టీమిండియా తరపున మూడో ఆటగాడిగా 

మరిన్ని వార్తలు