సచిన్‌ రికార్డుపై కన్నేసిన మిథాలీ రాజ్‌

28 Jun, 2021 17:22 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్‌ జట్టు సారథి మిథాలీ రాజ్‌ అరుదైన ఘనత సాధించింది. క్రికెట్‌ దిగ్గజం, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తర్వాత సుదీర్ఘ కాలం వన్డే క్రికెట్‌ ఆడిన రెండో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. 1999, జూన్‌ 26న అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఆమె.. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే ద్వారా వన్డే క్రికెట్‌లో 22 వసంతాలు పూర్తి చేసుకొంది. ఈ క్రమంలో ఆమె సచిన్‌ రికార్డుపై కన్నేసింది. సచిన్‌.. 22 ఏళ్ల 91 రోజుల పాటు వన్డే క్రికట్‌లో కొనసాగగా, మిథాలీ మరో 90 రోజుల్లో ఆ రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది. 

కాగా, కొంతకాలం క్రితమే పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన మిథాలీ.. టెస్ట్‌లు, వన్డే క్రికెట్‌లో కొనసాగుతుంది. వచ్చే ఏడాది జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌ గెలిచి క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని భావిస్తున్న ఆమె.. టీమిండియాను ఇప్పటి వరకు రెండు సార్లు వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్స్‌కు చేర్చింది. కాగా, 38 ఏళ్ల మిథాలీ.. వన్డేల్లో  పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంది. అత్యధిక మ్యాచ్‌లు(215), అత్యధిక పరుగులు(7170), అత్యధిక అర్ధసెంచరీలు(56) ఇలా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఓవరాల్‌గా 11 టెస్ట్‌లు, 215 వన్డేలు, 89 టీ20లు ఆడిన మిథాలీ.. 8 శతకాలు 77 అర్ధశతకాల సాయంతో 10000కుపైగా పరుగులను సాధించింది. 
చదవండి: యూరో కప్‌ నుంచి పోర్చుగ‌ల్ ఔట్‌.. రొనాల్డో భావోద్వేగం

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు