T20 WC 2022: పాకిస్తాన్‌ - నెదర్లాండ్స్‌ మ్యాచ్‌.. కామెంటేటర్‌గా మిథాలీ రాజ్‌

30 Oct, 2022 07:46 IST|Sakshi

భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ సరికొత్త అవతరమెత్తనుంది. టీ20 ప్రపంచకప్‌-2022లో కామెంటేటర్‌గా మిథాలీ రాజ్‌ వ్యవహరించనుంది..ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం జరగనున్న నెదర్లాండ్స్-పాకిస్తాన్‌ మ్యాచ్‌తో  కామెంటేటర్‌గా ఆమె న్యూ జర్నీ ప్రారంభం కానుంది. ఆమె వ్యాఖ్యాతగా స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో ఒప్పందం కుదర్చుకుంది.

అదే విధంగా ఆదివారం సాయంత్రం జరగనున్న భారత్‌-దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు కూడా మిథాలీ  కామెంటేటర్‌గా వ్యవహరించనుంది. ఇక 22 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌కు ఈ ఏడాది జూన్‌లో మిథాలీ రాజ్ ముగింపు పలికింది. తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన రికార్డులు మిథాలీ తన పేరిట లిఖించుకుంది. ముఖ్యంగా మహిళా క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికి మిథాలీ పేరునే ఉంది.

చావో రేవో తెల్చుకోనున్న పాకిస్తాన్‌
ఇక మెగా ఈ టోర్నీలో వరుస ఓటములతో సతమతమవుతున్న పాకిస్తాన్‌ పసికూన నెదర్లాండ్స్‌తో చావోరేవో తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఒక వేళ పాకిస్తాన్‌ ఓటమి చెందితే.. అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కాగా గత మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో పాకిస్తాన్‌ కంగుతిన్న సంగతి తెలిసిందే. అంతకుముందు తొలి మ్యాచ్‌లో భారత్‌ చేతిలో పాక్‌ ఓటమి పాలైంది.
చదవండి: AUS Vs WI: ఆసీస్‌తో టెస్టు సిరీస్‌.. విండీస్‌ జట్టు ప్రకటన! చంద్రపాల్ కొడుకు ఎంట్రీ

మరిన్ని వార్తలు