భారత పురుషుల ఆర్చరీ జట్టుకు కాంస్యం

18 Nov, 2021 05:06 IST|Sakshi

ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఢాకాలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో భారత పురుషుల జట్టు కాంస్య పతకం నెగ్గగా... మహిళల జట్టు ఓడిపోయింది. అభిషేక్‌ వర్మ, అమన్‌ సైనీ, రిషభ్‌ యాదవ్‌లతో కూడిన భారత జట్టు 235–223తో బంగ్లాదేశ్‌ను ఓడించి కాంస్యం నెగ్గింది. భారత మహిళల జట్టు కాంస్య పతక పోరులో 208–220తో కజకిస్తాన్‌ జట్టు చేతిలో ఓడింది.

మరిన్ని వార్తలు