Mike Tyson: 40 కోట్లు చెల్లించాలంటూ దిగ్గజం మైక్‌ టైసన్‌పై సివిల్‌ దావా

25 Jan, 2023 11:50 IST|Sakshi

బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌ తనకు 5 మిలియన్‌ డాలర్లు(ఇండియన్‌ కరెన్సీలో సుమారు రూ. 40 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలంటూ ఒక మహిళ కోర్టులో సివిల్‌ దావా వేయడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. 1992లో లిమోసిన్ నగరంలో ఒక పబ్‌లో 18 ఏళ్ల మోడల్‌పై బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ అత్యాచారం చేశాడన్న ఆరోపణలు వచ్చాయి.

ఆ తర్వాత అత్యాచారం కేసులో దోషిగా తేలిన టైసన్ మూడు సంవత్సరాలు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. తాజాగా ఈ కేసులో  పౌర నష్టపరిహారాన్ని కోరుతూ న్యూయార్క్ రాష్ట్ర చట్టం ప్రకారం సదరు మోడల్‌.. కోర్టులో సివిల్ దావా సమర్పించారు. 1992లో నైట్‌క్లబ్‌లో మైక్‌ టైసన్‌ను కలిసినప్పుడు ఆయన తనపై అత్యాచారం చేశాడని ఆమె తన సివిల్ దావాలో పేర్కొంది.

టైసన్ తనపై అత్యాచారం చేయడం వల్ల తాను శారీరకంగా, మానసికంగా బాధపడుతూనే ఉన్నానని బాధిత మోడల్ చెప్పారు. తనకు 5మిలియన్ డాలర్ల( సుమారు రూ. 40 కోట్లు) నష్టపరిహారం ఇవ్వాలని కోరింది. ఇక 1966వ సంవత్సరంలో బ్రూక్లిన్ నగరంలో జన్మించిన టైసన్ హెవీ వెయిట్ ఛాంపియన్‌గా అవతరించాడు. బాక్సింగ్‌ రింగ్‌లో కింగ్‌గా నిలిచిన మైక్‌ టైసన్‌ పంచ్‌ల దాటికి ప్రత్యర్థులు వణికిపోయేవారు.

చదవండి: మైదానంలో ‘కింగ్‌’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే!

బుమ్రా విషయంలో రోహిత్‌ శర్మ కీలక అప్‌డేట్‌

మరిన్ని వార్తలు