Noel David: ద‌య‌నీయ స్థితిలో టీమిండియా మాజీ క్రికెట‌ర్‌.. భ‌రోసా క‌ల్పించిన హెచ్‌సీఏ 

28 Feb, 2022 19:27 IST|Sakshi

గ‌త కొంత‌కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతూ హైదరాబాద్‌లోని అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌, హైద‌రాబాద్ ఆల్‌రౌండ‌ర్ నోయెల్ డేవిడ్‌ను హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) అధ్య‌క్షుడు మ‌హ్మ‌ద్ అజ‌హారుద్దీన్ సోమ‌వారం క‌లిశాడు. ఈ సంద‌ర్భంగా నోయెల్ ఆరోగ్యం గురించి వైద్యుల వ‌ద్ద‌ ఆరా తీసిన అజ‌హార్‌.. నోయెల్ కిడ్నీ ఆప‌రేష‌న్‌కు అయ్యే ఖ‌ర్చునంతా హెచ్‌సీఏనే భ‌రిస్తుంద‌ని భరోసా ఇచ్చాడు.


అలాగే నోయెల్‌కు వ్య‌క్తిగ‌త ఆర్ధిక సాయాన్ని కూడా చేస్తామ‌ని అజ‌హార్ హామీ ఇచ్చాడు. ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండ‌ర్ అయిన 51 ఏళ్ల నోయెల్‌.. 1997లో వెస్టిండీస్‌లో పర్యటించిన భారత జట్టులో సభ్యుడు. టీమిండియా త‌ర‌ఫున 1997లో నాలుగు వన్డేలు ఆడిన నోయెల్‌.. బ్యాటింగ్‌లో త‌న సామ‌ర్ధ్యానికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌న‌ప్ప‌టికీ, బౌలంగ్‌లో ప‌ర్వాలేద‌నిపించి నాలుగు వికెట్లు పడగొట్టాడు. 
చ‌ద‌వండి: స‌చిన్ స‌హ‌చ‌రుడు, టీమిండియా మాజీ ప్లేయ‌ర్ అరెస్ట్‌

మరిన్ని వార్తలు