Asia Cup 2022: భారత్‌తో తొలి మ్యాచ్‌.. ఆఫ్రిది స్థానంలో పాక్‌ యువ పేసర్‌!

22 Aug, 2022 15:10 IST|Sakshi

ఆసియాకప్‌-2022కు పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ షాహీన్ షా ఆఫ్రిది గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. దీంతో షాహీన్ స్థానంలో ఆ జట్టు యువ పేసర్‌ మహ్మద్ హస్నైన్‌ను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ ఎంపిక చేసింది. హస్నైన్ 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో పాక్‌ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు.

ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఎనిమిది వన్డేలు, 18 టీ20 మ్యాచ్‌లు పాక్‌  హస్నైన్ తరపున ఆడాడు. అతడు ఇప్పటి వరకు వన్డేల్లో 18 వికెట్లు, టీ20ల్లో 17 వికెట్లు సాధించాడు. మహ్మద్ హస్నైన్ ప్రస్తుతం ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతోన్న ది హండ్రెడ్ లీగ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్‌ జట్టులో భాగంగా ఉన్నాడు.

ఇక పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు నుంచి పిలుపు రావడంతో త్వరలోనే అతడు జట్టుతో చేరే అవకాశం ఉంది. కాగా ఆసియాకప్‌-2022 యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్‌ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 28న భారత్‌తో తలపడనుంది.

ఆసియా కప్‌కు పాక్‌ జట్టు
బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, మహ్మద్ హస్నైన్‌, షాహనావాజ్ ఆఫ్రిది దహానీ  ఉస్మాన్ ఖదీర్
చదవండి: Ind Vs Zim 3rd ODI: అలాంటప్పుడు ఎందుకు ఎంపిక చేసినట్లు? ఇది నిజంగా అన్యాయం! కనీసం ఇప్పుడైనా..

మరిన్ని వార్తలు