PAK vs AUS: వైరల్‌గా మారిన పాక్‌ క్రికెటర్‌ చర్య.. ఏం జరిగింది

7 Mar, 2022 11:20 IST|Sakshi

ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ చర్య సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ఆదివారం మూడోరోజు ఆటలో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ సమయంలో పాక్‌ స్పిన్నర్‌ నుమాన్‌ అలీ బౌలింగ్‌కు వచ్చాడు. క్రీజులో ఉ‍న్న లబుషేన్‌ స్వీప్‌ షాట్‌ ఆడే క్రమంలో నుమాన్‌ అలీ బంతిని అంచనా వేయడంలో పొరబడ్డాడు. దీంతో మిస్‌ అయిన బంతి లబుషేన్‌ మోచేతిని తాకుతూ పక్కకు వెళ్లింది.

ఇది గమనించిన కీపర్‌ రిజ్వాన్‌ లబుషేన్‌ వద్దకు వచ్చి దెబ్బ ఏమన్న తగిలిందేమో చూసి అతని మోచేతిని గట్టిగా రుద్దాడు. ఏం పర్లేదు.. బాగానే ఉంది అని చెప్పగానే రిజ్వాన్‌ నవ్వుతూ అతని చేతిని వదిలేశాడు. దీనికి సంబంధించిన వీడియోనూ పీసీబీ తన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ''బంతిని అందుకోవడం అంటే సాయపడడంలోనే రిజ్వాన్‌ ఎక్కువ సంతోషం ఉందని గ్రహించాడు'' అంటూ ఫన్నీ క్యాప్షన్‌ రాసుకొచ్చింది. 

కాగా మ్యాచ్‌ నాలుగోరోజు వర్షం అడ్డుపడడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. ఇక మూడోరోజు ఆటలో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. పాక్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ధీటుగా జవాబిచ్చింది. ఈ నేపథ్యంలో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా సెంచరీ చేజార్చుకున్నాడు. మూడోరోజు ఆట ముగిసేసమయానికి ఆస్ట్రేలియా 73 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 27 1 పరుగులు చేసింది. లబుషేన్‌ 61, స్టీవ్‌ స్మిత్‌ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 476 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది.

చదవండి: Cristiano Ronaldo: సంచలనం సృష్టిస్తున్న రొనాల్డో బహిరంగ స్నానం

Shane Warne Death: వార్న్‌ మరణం నా హృదయాన్ని ముక్కలు చేసింది

మరిన్ని వార్తలు