మోస్ట్ వాల్యూబుల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా మహ్మద్‌ రిజ్వాన్‌ ..

7 Jan, 2022 08:30 IST|Sakshi

2021 ఏడాదికి గాను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు వార్షిక అవార్డులను ప్రకటించింది. 2021లో పాకిస్తాన్‌ అద్భుతమైన విజయాలు సాధించింది. టీ20 ప్రపంచకప్‌-2021లో చిరకాల ప్రత్యర్థి భారత్‌పై 10 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌ ఈవెంట్లలో భారత్‌పై పాకిస్తాన్‌ గెలవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా టీ20ల్లో ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక విజయాలు(20) నమోదు చేసిన జట్టుగా పాక్‌ నిలిచింది. పాక్‌ విజయాల్లో ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌, కెప్టెన్‌ బాబర్‌ ఆజం కీలక పాత్రపోషిస్తున్నారు.

వీరితో పాటు హసన్ అలీ, షాహీన్ షా ఆఫ్రిది బౌలింగ్‌ అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో పాక్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ మోస్ట్ వాల్యూబుల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. గత ఏడాది టీ20ల్లో రిజ్వాన్‌ 1,326 పరుగులు సాధించాడు. ఇక హసన్ అలీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకోగా,కెప్టెన్ బాబర్ అజామ్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కైవసం చేసుకున్నాడు.  అదే విధంగా పాక్‌ యువ బౌలర్‌ మహ్మద్ వసీం జూనియర్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌ను అందుకున్నాడు.

చదవండి: టాప్‌-5లోకి సౌతాఫ్రికా ... టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే!

మరిన్ని వార్తలు