మంచి మనసు.. ఓ వ్యక్తి ప్రాణం కాపాడిన మహ్మద్‌ షమీ! వీడియో వైరల్

26 Nov, 2023 09:20 IST|Sakshi

టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ తన మంచి మనసును చాటుకున్నాడు. షమీ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. శనివారం అర్ధ రాత్రి షమీ ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో తన ముందు వెళ్తున్న ఓ కారు కొండపై నుంచి కిందకి దూసుకు వెళ్లింది. ఈ క్రమంలో షమీ వెంటనే తన కారును ఆపి.. కొంతమంది సాయంతో కారులో నున్న వ్యక్తిని సకాలంలో బయటకు తీసి అతడికి రెండో జన్మను ఇచ్చాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షమీ షేర్‌ చేశాడు. "అతను చాలా అదృష్టవంతుడు. దేవడు అతనికి రెండో జీవితాన్ని ఇచ్చాడు. నేను నైనిటాల్‌కు వెళ్తుండగా కొండ రహదారిపై నా ముందు వెళ్తున్న ఓ కారు లోయలో పడిపోయింది.

వెంటనే నా కారుని ఆపి కొంత మంది సాయంతో అతడిని సురక్షితంగా బయటకు తీశాం అని ఆ వీడియాకు షమీ క్యాప్షన్‌గా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో షమీపై ప్రశంసల వర్షం కురిస్తోంది. నిజంగా నీవు చాలా గ్రేట్‌ బ్రో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో షమీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేవలం 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టి టోర్నీ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు.
చదవండి: IPL 2024: ఐపీఎల్‌-2024కు రాజస్తాన్‌కు బిగ్‌ షాక్‌.. స్టార్‌ ఆటగాడు దూరం

A post shared by 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@mdshami.11)

మరిన్ని వార్తలు