ఐపీఎల్‌ 2021: సిరాజ్‌, ఆవేశ్‌ ఖాన్‌ సరికొత్త రికార్డు

13 Oct, 2021 16:33 IST|Sakshi
Courtsey: IPL Twitter

Most Dot Balls In IPL 2021 Season.. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, ఆర్‌సీబీ బౌలర్లు ఆవేశ్‌ ఖాన్‌, మహ్మద్‌ సిరాజ్‌లు కొత్త రికార్డు సృష్టించారు. ఈ సీజన్‌లో అత్యధిక డాట్‌ బాల్స్‌ వేసిన జాబితాలో ఇద్దరు అగ్రస్థానంలో ఉన్నారు. ఆవేశ్‌ ఖాన్‌, సిరాజ్‌లు ఈ సీజన్‌లో 147 డాట్‌ బాల్స్‌ వేయగా.. ఆ తర్వాత మహ్మద్‌ షమీ(పంజాబ్‌ కింగ్స్‌) 145 డాట్‌ బాల్స్‌తో రెండో స్థానంలో, 142 డాట్‌ బాల్స్‌తో బుమ్రా మూడోస్థానంలో, ట్రెంట్‌ బౌల్ట్‌ 138 డాట్‌ బాల్స్‌తో నాలుగో స్థానంలో, 137 డాట్‌ బాల్స్‌తో వరుణ్‌ చక్రవర్తి ఐదో స్థానంలో ఉన్నాడు.

ఇందులో ఆవేశ్‌ ఖాన్‌ ఇప్పటికే టాప్‌ పొజీషన్‌లో ఉండగా.. వరుణ్‌ చక్రవర్తి మినహా మిగతా బౌలర్లకు టాప్‌ స్థానానికి చేరుకునే అవకాశం లేదు. ఒకవేళ కేకేఆర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరగనున్న క్వాలిఫయర్‌ 2లో ఓడిన జట్టు ఇంటి బాట పట్టనుంది. కాగా ఇప్పటికే సీఎస్‌కే ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.

చదవండి: Gautam Gambhir: 'మిస్టరీ' అంటారు.. మరి ఇన్నేళ్లుగా ఎలా ఆడుతున్నాడు

IPL 2022 Mega Auction: రైనా సహా ఆ ముగ్గురి ఖేల్‌ ఖతమైనట్టే..!

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు