WI Vs IND: సూపర్‌ సిరాజ్‌.. మూడు బంతుల్లో రెండు వికెట్లు.. వీడియో వైరల్‌!

28 Jul, 2022 12:17 IST|Sakshi

పోర్ట్‌ ఆఫ్‌స్పెయిన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 117 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇక పలుమార్లు వర్షం అంతరాయం కలిగించచిన ఈ మ్యాచ్ ను 36 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 36 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 225 పరుగుుల చేసింది. భారత బ్యాటర్లలో శుభమాన్‌ గిల్‌(96), శిఖర్‌ ధావన్‌(58) పరుగులతో రాణించారు.

అనంతరం డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో విండీస్‌ టార్గెట్‌ను 257 పరుగులగా  నిర్దేశించారు. ఇక 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ను ఆదిలోనే భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. విండీస్‌ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేసిన సిరాజ్‌ తొలి బంతికే కైల్‌ మైర్స్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేయగా.. మూడో బంతికే బ్రూక్స్‌ను ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు పంపాడు. తద్వారా ఒక్క పరుగుకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

అనంతరం ఏ దశలోనే విండీస్‌ కోలుకోలేక పోయింది. ఈ క్రమంలో  విండీస్ 26 ఓవవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో  చహల్‌ 4, సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ చెరో రెండు వికెట్లు, అక్షర్‌ పటేల్‌, ప్రసిద్ధ్‌ కృష్ణా చెరో వికెట్‌ తీసుకున్నారు. ఇక సిరాజ్‌ బౌలింగ్‌ సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
వెస్టిండీస్‌ వర్సెస్‌ ఇండియా మూడో వన్డే:
►వేదిక: క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌, పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌, ట్రినిడాడ్‌
►టాస్‌: ఇండియా- బ్యాటింగ్‌
►మ్యాచ్‌కు వర్షం ఆటంకి
►ఇండియా స్కోరు: 225-3 (36 ఓవర్లు)
►డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి(డీఎల్‌ఎస్‌)లో భారత జట్టు నిర్దేశించిన లక్ష్యం 257 పరుగులు
►వెస్టిండీస్‌ స్కోరు: 137-10 (26 ఓవర్లు)
►విజేత: ఇండియా- డీఎల్‌ఎస్‌ పద్ధతిలో 119 పరుగుల తేడాతో గెలుపు
►మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసిన ఇండియా
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: శుబ్‌మన్‌ గిల్‌(98 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 98 పరుగులు- నాటౌట్‌)
►ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌: శుబ్‌మన్‌ గిల్‌(64, 43, 98 పరుగులు)
చదవండి
Shubman Gill: అప్పుడేమో ద్విశతకం! 91, 96, 98 నాటౌట్‌.. పాపం సెంచరీ గండం గట్టెక్కలేడా?!

మరిన్ని వార్తలు