IPL 2022: ఒకప్పుడు అత్యధిక వికెట్ల వీరుడు.. ఇప్పుడు నెట్‌బౌలర్‌గా.. షాకింగ్‌!

20 Mar, 2022 10:32 IST|Sakshi

ఒకప్పడు ఐపీఎల్‌లో దుమ్ము దులిపాడు. ప్రత్యర్ధి బ్యాటర్లకు తన బౌలింగ్‌తో చుక్కలు చూపించాడు. ఐపీఎల్‌-2014లో అత్యధిక వికెట్ల వీరుడు. అతడే టీమిండియా పేసర్‌ మెహిత్‌ శర్మ. ఒకప్పుడు స్టార్‌ బౌలర్‌గా చక్రం తిప్పిన మోహిత్‌ శర్మ ఇప్పుడు నెట్‌ బౌలర్‌గా ఎంపికయ్యడంటే ఊహించడానికే కష్టంగా ఉంది. ఐపీఎల్‌లో కొత్త జట్టుగా అవతరించిన గుజరాత్‌ టైటాన్స్‌కు నెట్‌ బౌలర్‌గా మెహిత్‌ శర్మ ఎంపికైనట్లు తెలుస్తోంది.

అతడితో పాటు మరో భారత పేసర్‌ బరీందర్ స్రాన్ కూడా గుజరాత్‌ నెట్‌ బౌలర్‌గా  ఎంపికైనట్లు సమాచారం. ఇక ఐపీఎల్‌-2022 మెగా వేలంలో పాల్గోన్న మెహిత్‌ శర్మను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. మోహిత్‌ శర్మ చివరసారిగా ఐపీఎల్‌-2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు. ఇక 2014 సీజన్‌లో 23 వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్‌ను కూడా గెలుచుకున్నాడు.

ఇప్పటి వరకు 86 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన మోహిత్‌.. 92 వికెట్లు పడగొట్టాడు. ఇక 2014 టీ20 ప్రపంచకప్‌, 2015 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ తరుపున మోహిత్‌ శర్మ ప్రాతినిధ్యం వహించాడు. కాగా మార్చి 26 నుంచి ఐపీఎల్‌-2022 ప్రారంభం కానుంది. ఇక ఈ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తన తొలి మ్యాచ్‌ను మరో కొత్త జట్టు లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మార్చి 28న ఆడనుంది.

చదవండి: IPL 2022: కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: హార్దిక్‌ పాం‍డ్యా

మరిన్ని వార్తలు