పోరాడి ఓడిన బోపన్న–జేమీ ముర్రే జంట

17 Apr, 2022 05:45 IST|Sakshi

మోంటెకార్లో ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నీలో రోహన్‌ బోపన్న (భారత్‌)–జేమీ ముర్రే (బ్రిటన్‌) జంట పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో బోపన్న–జేమీ ముర్రే ద్వయం 6–3, 6–7 (4/7), 9–11తో టాప్‌ సీడ్‌ జో సాలిస్‌బరీ (బ్రిటన్‌)–రాజీవ్‌ రామ్‌ (అమెరికా) జోడీ చేతిలో ఓడింది. బోపన్న–జేమీ ముర్రే జంటకు 76,560 యూరోల (రూ. 63 లక్షల 19 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 360 పాయింట్లు లభించాయి.

మరిన్ని వార్తలు