అదే నాకు దినేశ్‌ కార్తీక్‌ చెప్పాడు: మోర్గాన్‌

16 Oct, 2020 22:00 IST|Sakshi

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు నయా సారథిగా ఇయాన్‌ మోర్గాన్‌ నియమించబడ్డ సంగతి తెలిసిందే. ఈరోజు(శుక్రవారం) కేకేఆర్‌ కెప్టెన్సీ పదవికి దినేశ్‌ గుడ్‌ బై చెప్పడంతో ఆ బాధ్యతల్ని మోర్గాన్‌కు అప్పచెప్పారు. తాను కెప్టెన్సీ పదవిని చేయలేకపోతున్నాననే కారణాన్ని దినేశ్‌ తెలపడంతో దాన్ని కేకేఆర్‌ ఫ్రాంచైజీ యాజమాన్యం గౌరవించింది. అయితే కెప్టెన్‌గా తప్పుకునే విషయాన్ని తనకు ముందుగానే చెప్పినట్లు మోర్గాన్‌ తెలిపాడు. ‘ నిన్న(గురువారం)నే కెప్టెన్సీ మార్పుపై చర్చ జరిగింది. కార్తీక్‌ నా వద్దకు వచ్చాడు. అప్పుడు కోచ్‌లు కూడా అక్కడే ఉన్నారు. నేను కెప్టెన్సీ పదవి నుంచి వైదొలుగుతానని కార్తీక్‌ చెప్పాడు.  బ్యాటింగ్‌పై ఫోకస్‌ చేయాలనే ఉద్దేశంతోనే తప్పుకుంటున్నట్లు నాతో చెప్పాడు. కెప్టెన్సీ బాధ్యతలతో బ్యాటింగ్‌పై ఫోకస్‌ చేయలేకపోతున్నానని అందుకే తప్పుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. అది జట్టు కూడా మంచిదని వివరించాడు. కార్తీక్‌ నిస్వార్థంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ధైర్యం కావాలి’ అని ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో భాగంగా టాస్‌ వేయడానికి వచ్చినప్పుడు మోర్గాన్‌ స్పష్టం చేశాడు. (గెలిచారు కదా.. మొహం అలా పెట్టావేంటి?)

తన కెప్టెన్సీపై వస్తున్న విమర్శలకు దినేశ్‌ కార్తీక్‌ ముగింపు పలికాడు. తాను కేకేఆర్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన నిర్ణయం ప్రకటించాడు.   ఈ మేరకు శుక్రవారం తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఇంగ్లండ్‌కు వరల్డ్‌ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్‌ను జట్టులో ఉంచుకొని కార్తీక్‌కు కెప్టెన్సీ ఎందుకని ప్రశ్నించారు. కానీ మేనేజ్‌మెంట్ మాత్రం కార్తీక్‌పైనే నమ్మకం ఉంచింది. కోల్‌కతా విజయాల బాట పట్టాక.. కీలకమైన ప్లేఆఫ్స్ దశకు ముందు దినేశ్ కార్తీక్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. రెండన్నేళ్లుగా కేకేఆర్‌కు దినేశ్‌ కార్తీక్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. దినేశ్ కార్తీక్ నిర్ణయం పట్ల కోల్‌కతా నైట్ రైడర్స్ సీఈవో వెంకీ మైసూరు స్పందించారు. దినేశ్‌ కార్తీక్‌ లాంటి నాయకుడు తమ జట్టులో ఉండటం అదృష్టమన్నారు. తనకు తానే ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎంతో ధైర్యం అవసరమన్నారు. దినేశ్ కార్తీక్ నిర్ణయంతో ఆశ్చర్యానికి గురయ్యామని.. కానీ అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు. (ఈ పేరుకు కొంచెం గౌరవం ఇవ్వండి : గేల్‌)

మరిన్ని వార్తలు