FIFA WC2022: ఫ్రాన్స్‌ చేతిలో చిత్తు.. బ్రస్సెల్స్‌లో మొరాకో అభిమానుల విధ్వంసం

15 Dec, 2022 07:48 IST|Sakshi

ఫిఫా ప్రపంచకప్-2022లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ తన జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఖతర్‌ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో మొరాకోను చిత్తు చేసిన ఫ్రాన్స్‌.. వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేరుకుంది. ఇక నాకౌట్‌ దశలో అదరగొట్టిన మొరాకో.. కీలకమైన సెమీఫైనల్లో మాత్రం చేతులేత్తేసింది. 0-2 తేడాతో ఓటమిపాలైన మొరాకో ఈ మెగా ఈవెంట్‌ నుంచి ఇంటిముఖం పట్టింది.

బ్రస్సెల్స్‌లో అల్లర్లు..
కాగా మొరాకో ఓటమిని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో మొరాకో అభిమానులు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో విధ్వంసం సృష్టించారు. సుమారు 100 మంది ఫ్యాన్స్‌ బ్రస్సెల్స్ సౌత్ స్టేషన్ సమీపంలో పోలీసులపై బాణాసంచాలను విసిరారు.

అదే విధంగా వీధుల్లో ఉన్న షాప్‌లకు నిప్పు అంటించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ అల్లర్లకు కారణమైన చాలా మంది అభిమానలను పోలీసులు  అదుపులోకి తీసుకున్నారని, భారీ నష్టం ఏమీ జరగలేదని రాయిటర్స్ పేర్కొంది.


చదవండిFIFA WC:సెమీస్‌లో అదరగొట్టిన ఫ్రాన్స్‌.. రికార్డులు ‍బ్రేక్‌ చేస్తూ విజయం

మరిన్ని వార్తలు