FIFA WC 2022: వార్నీ వదిలేస్తే మొత్తం తినేసేలా ఉన్నాడు!

17 Dec, 2022 16:18 IST|Sakshi

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో శనివారం మొరాకో, క్రొయేషియా మధ్య మూడోస్థానం కోసం ప్లేఆఫ్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరుజట్లు అంతా సిద్ధం చేసుకున్నాయి. గతేడాది రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా మూడో స్థానంలో నిలుస్తుందా లేక తొలిసారి సెమీస్‌ వరకు అందరి దృష్టిని ఆకర్షించిన మొరాకో జట్టు మూడోస్థానం సాధించి కెరీర్‌ బెస్ట్‌ను అందుకుంటుందా అనేది చూడాలి.

ఈ సంగతి పక్కనబెడితే.. మొరాకో గోల్‌కీపర్‌ యాసీ బౌనౌ కుమారుడు చేసిన పని సోషల్‌ మీడియలో వైరల్‌గా మారింది. పోర్చుగల్‌తో క్వార్టర్‌ ఫైనల్లో గెలిచిన అనంతరం యాసీ బౌనౌ తన కుమారుడితో కలిసి ఇంటర్య్వూ ఇచ్చేందుకు వచ్చాడు. యాసీ మాట్లాడుతుండగా.. రిపోర్టర్‌ చేతిలో ఉన్న మైక్‌ను ఐస్‌క్రీం అనుకొని నాకడానికి ప్రయత్నించాడు. కానీ అది ఐస్‌క్రీం కాదని తెలుసుకొని వెనక్కి తగ్గాడు. కొడుకు చేసిన పనిని గమనించిన యాసీ బౌనౌకు నవ్వు ఆగలేదు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి.

ఇక మొరాకో గోల్‌కీపర్‌గా యాసీ బౌనౌ సూపర్ ఫామ్‌ కొనసాగించాడు. పెనాల్టీ అడ్డుకోవడంలో మంచి ప్రదర్శన కనబరిచిన యాసీ ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ అదే ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 13 పెనాల్టీల్లో ఐదింటిని గోల్స్‌ కాకుండా అడ్డుకున్నాడు.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు