ఇటాలియన్‌ గ్రాండ్‌ ప్రిలో విషాదం.. మోటో3 రైడర్‌ మృతి 

30 May, 2021 20:32 IST|Sakshi

రోమ్‌: ఇటాలియన్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌లో విషాదం చోటచేసుకుంది. శనివారం నిర్వహించిన క్వాలిఫయింగ్‌ టోర్నీలో స్విట్జర్లాండ్‌కు చెందిన మోటో 3 డ్రైవర్‌ జాసన్ డుపాస్క్వియర్ ప్రమాదవశాత్తు బైక్‌ అదుపుతప్పడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కాగా తీవ్ర గాయాలతో పాటు ఇంటర్నల్‌ బ్లీడింగ్‌ ఎక్కువగా ఉండడంతో జాసన్‌ ఆదివారం మృతి చెందినట్లు ఇటాలియన్‌ గ్రాండ్‌ప్రిక్స్‌ మోటోజీపి నిర్వాహకులు ప్రకటించారు.

జాసన్‌ డుపాస్క్వియర్‌ మృతి పట్ల మోటోజీపీ ట్విటర్‌లో సంతాపాన్ని ప్రకటించింది. 'మోటోజీపీ తరపున జాసన్‌ డుపాస్క్వియర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుతున్నాం. ఇంత చిన్న వయసులో అతను మనల్ని వదలివెళ్లడం బాధాకరం. ఈ సందర్భంగా అతని ఫ్యామిలీ, మిత్రులకు మా ప్రగాడ సానభూతిని తెలుపుతున్నాం అని ట్వీట్‌ చేసింది.

కాగా మోటో 3 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో డుపాస్క్వియర్ ప్రస్తుతం  రెండవ సీజన్‌లో ఉన్నాడు. కాఆగా అతను 27 పాయింట్లతో మోటో3లో 12వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. డుపాస్క్వియర్ తన కెరీర్‌ను సూపర్‌మోటోలో ప్రారంభించాడు, అక్కడ అతను చాలాసార్లు స్విస్ జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు వెళ్లేముందు 2016 లో ఎన్‌ఇసి ఛాంపియన్‌షిప్ మోటో 3 టైటిల్‌ను గెలుచుకున్నాడు. 
చదవండి: డబ్బులు ఇవ్వమన్నందుకు సుశీల్‌ నన్ను చితకబాదాడు

>
మరిన్ని వార్తలు