IPL 2023: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ధోని.. 12 ఏళ్ల రికార్డు బద్దలు!

1 Apr, 2023 10:16 IST|Sakshi
PC: IPL.com

టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారధి ఎంస్‌ ధోని ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో చరిత్రలోనే అత్యంత పెద్ద వయస్కుడైన కెప్టెన్‌గా ధోని నిలిచాడు. ఐపీఎల్‌-2022లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే సారథిగా బరిలోకి దిగిన ధోని ఈ అరుదైన ఫీట్‌ సాధించాడు. ధోని 41 ఏళ్ల 267  రోజుల వయస్సులో ఈ ఘనత నమోదు చేశాడు.

ఇప్పటి వరకు ఈ రికార్డు దివంగత ఆస్ట్రేలియా స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ పేరిట ఉండేది. ఐపీఎల్‌-2011 సీజన్‌లో 41 ఏళ్ల 249 వయస్సులో రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా షేన్‌ వార్న్‌ వ్యవహరించారు. తాజా మ్యాచ్‌తో వార్న్‌ 12 ఏళ్ల రికార్డును మిస్టర్‌ కూల్‌ బ్రేక్‌ చేశాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలి మ్యాచ్‌లో సీఎస్‌కేకు నిరాశ ఎదురైంది.

అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 5వికెట్ల తేడాతో సీఎస్‌కే ఓటమి పాలైంది. 179 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్‌ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గుజరాత్‌ బ్యాటర్లలో శుబ్‌మన్‌ గిల్‌ (63) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖర్లో వైస్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ 3 బంతుల్లో 10 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చే​ర్చాడు.
చదవండిGT Vs CSK: చెన్నై పేసర్‌ అరుదైన ఘనత.. టోర్నీ చరిత్రలోనే మొదటిసారి ఇలా! గుజరాత్‌ కూడా..

మరిన్ని వార్తలు