MS Dhoni: అందుకే.. ఫీల్డ్‌లో నాకు ఎప్పుడూ కోపం రాదు

23 Sep, 2022 21:11 IST|Sakshi

మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు దోని అందించాడు. ఫీల్డ్‌లో ఎటువంటి పరిస్థితులోనైనా ప్రశంతంగా కన్పించి ధోని.. మిస్టర్‌ కూల్‌గా పేరుగాంచాడు. తన ప్రశాంతత వెనుక ఉన్న కారణాన్ని ధోని తాజాగా బయటపెట్టాడు.

ప్రముఖ ఇన్వర్టర్‌ బ్యాటరీల సంస్థ లివ్‌ఫాస్ట్‌ కార్యక్రమంలో శుక్రవారం ధోనీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. కోపంతో మనం చేసదేమి లేదని, వీలైనంత వరకు నా భావోద్వేగాలను నియంత్రించుకునేందుకు ప్రయత్నిస్తానని ఎంఎస్‌ తెలిపాడు.


"నిజాయితీగా చెప్పాలంటే.. ఫీల్డ్‌లో మేము ఎటువంటి తప్పులు చేయకూడదనుకుంటాము. ఒక ఆటగాడు క్యాచ్‌ డ్రాప్‌ చేసినా, మిస్‌ ఫీల్డ్‌ చేసినా  అలా ఎందుకు అయింది నేను ఆలోచిస్తాను. కోపం తెచ్చు కోవడం వల్ల పెద్దగా సాధించినది ఏమి ఉండదు. అప్పటికే స్టేడియంలో 40వేల మంది ప్రేక్షకులతో పాటు, కోట్లాది బంది అభిమానులు టీవీల్లో మ్యాచ్‌ను వీక్షిస్తుంటారు. అందుకే ఎందుకు ఆలా జరిగిందని ఆలోచిస్తాను.

ఆటగాడు ఎవరైనా గ్రౌండ్‌లో వంద శాతం శ్రద్ధగా ఉండి ఆ తర్వాత కూడా క్యాచ్‌ డ్రాప్‌ అయితే నాకు ఎలాంటి  ఇబ్బంది లేదు. అయితే అతడు ప్రాక్టీస్‌లో ఎన్ని క్యాచ్ లు పట్టుకున్నాడో, అదే విధంగా ముందు మ్యాచ్‌ల్లో ఎన్ని క్యాచ్‌లు పట్టాడు అన్నది నేను గుర్తు పెట్టుకుంటాను. కాగా క్యాచ్‌ వల్ల మ్యాచ్‌ ఓడిపోవచ్చు గానీ..   ఆ సమయంలో సదరు ఫీల్డర్‌ దృష్టిలో కూడా ఆలోచించడం ముఖ్యం" అని ధోని పేర్కొన్నాడు.
చదవండి: Duleep Trophy 2022 Final: డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైశ్వాల్‌..

మరిన్ని వార్తలు