MS Dhoni: ధోని కొత్త అవతారం.. వీడియో వైరల్‌

30 Sep, 2022 17:41 IST|Sakshi

ఎంఎస్‌ ధోని.. టీమిండియాకు రెండు వరల్డ్‌కప్‌లు అందించిన ఏకైక కెప్టెన్‌. తనదైన ఫినిషింగ్‌తో అభిమానుల మనసును ఎన్నోసార్లు గెలుచుకున్నాడు. తాను క్రికెటర్‌ కాకపోయుంటే ఫుట్‌బాలర్‌ అయ్యేవాడినని ధోని చాలాసార్లు చెప్పుకొచ్చాడు. వాస్తవానికి ధోని స్కూలింగ్‌ సమయంలో ఫుట్‌బాల్‌ విపరీతంగా ఆడేవాడు. అందునా గోల్‌ కీపింగ్‌ అంటే ప్రాణం. అయితే ఫుట్‌బాల్‌లో ఉంటే ఆదరణ పొందలేమన్న ఒకే ఒక్క కారణం ధోనిని క్రికెట్‌ర్‌ను చేసింది. ఆ తర్వాత కథ మనకు తెలిసిందే. 

రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోని ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇటీవలే ధోని ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నాడు. ప్రెస్‌మీట్‌కు ముందు క్రికెట్‌కు శాశ్వతంగా గుడ్‌బై చెప్పడానికే ప్రెస్‌మీట్‌ అని అంతా భావించారు. కానీ ధోని అందరి అంచనాలను తలకిందులు చేస్తే ఓరియో బిస్కెట్‌ బ్రాండ్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

తాజాగా ధోని క్రికెటర్‌ నుంచి కొత్త అవతారంలోకి మారాడు. ఇన్నాళ్లు క్రికెటర్‌గా రాణించిన ధోని ఇప్పుడు గోల్ఫ్‌తో కొత్త కెరీర్‌ను ప్రారంభించాడు. ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా(PGTI) తమ సోషల్‌ మీడియాలో ధోని గోల్ఫ్‌ ఆడిన వీడియోనూ షేర్‌ చేసింది. కెప్టెన్‌ కూల్‌ ఇన్‌ ది గోల్ఫ్‌ హౌస్‌ అంటూ క్యాప్షన్‌ జత చేసింది. కాగా ధోనితో పాటు టీమిండియా దిగ్గజం కపిల్‌ దేవ్‌ కూడా గోల్ఫ్‌ ఆటలో భాగమయ్యాడు. ఇక ధోని గోల్ఫ్‌ ఆడుతుంటే ఒక ప్రొఫెషనల్‌ ప్లేయర్‌లా అనిపించాడు. అతను కొట్టిన షాట్స్‌ క్రికెట్‌లో హెలికాప్టర్‌ షాట్లను తలపించాయి. 

ఇక ధోని గోల్ప్‌ ఆడడం ఇదే మొదటిసారి మాత్రం కాదు. ధోని ఫ్రెండ్‌ రాజీవ్‌ శర్మ ధోనికి గోల్ఫ్‌ను పరిచయం చేశాడు. ఇంతకముందు 2019లో అమెరికాకు చెందిన మెతుచెన్ గోల్ఫ్ కంట్రీ క్లబ్ తరపున తొలిసారి గోల్ఫ్‌ ఆడాడు. తెలియని విషయమేంటంటే అప్పటి టోర్నమెంట్‌లో ధోని ఐదు మ్యాచ్‌లకు గానూ నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఫ్లైట్‌ కేటగిరిలో రెండో స్థానంలో నిలవడం విశేషం.

చదవండి: ఓటమి తట్టుకోలేకపోయాడు.. గొడవ పడిన టెన్నిస్‌ స్టార్లు

ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత..

మరిన్ని వార్తలు