Ranji Trophy 2022: రంజీ చరిత్రలో ముంబై అతిపెద్ద విజయం.. ప్రపంచ రికార్డు బద్దలు

9 Jun, 2022 16:25 IST|Sakshi

రంజీ ట్రోఫీ చరిత్రలో ముంబై అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఉత్తరాఖండ్‌తో జరిగిన రెండో క్వార్టర్‌ ఫైనల్లో 725 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ముంబై సెమీఫైనల్లో అడుగుపెట్టింది. 795 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఉత్తరాఖండ్‌ ముంబై బౌలర్ల దాటికి 69 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఫస్ట్‌క్లాస్‌ చరిత్రలోనే అతి పెద్ద విజయం సాధించిన జట్టుగా ముంబై ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

ఇంతకముందు 92 ఏళ్ల క్రితం.. 1929-30లో షఫీల్డ్‌షీల్డ్‌ క్రికెట్‌లో న్యూ సౌత్‌వేల్స్‌ క్వీన్స్‌ల్యాండ్‌పై 685 పరుగుల తేడాతో విజయం సాధించడం ఇప్పటివరకు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో రికార్డుగా ఉంది. తాజగా ముంబై ఆ రికార్డును బద్దలు కొట్టింది.

ఉత్తరాఖండ్‌ ఇన్నింగ్స్‌లో శివమ్‌ ఖురానా 25 పరుగులతో టాప్‌ స్కోరర్ కాగా.. ముంబై బౌలర్లలో ధావల్‌ కులకర్ణి, షామ్స్‌ ములాని, తనుష్‌ కొటెన్‌ తలా మూడు వికెట్‌ తీయగా.. మోహిత్‌ అవస్తి ఒక వికెట్‌ పడగొట్టాడు. అంతకముందు ముంబై రెండో ఇన్నింగ్స్‌ను 3 వికెట్ల నష్టానికి 261 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. యశస్వి జైశ్వాల్‌ 103, పృథ్వీ షా 72 పరుగులు చేశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌ను ముంబై సువేద్‌ పార్కర్‌ డబుల్‌ సెంచరీతో 647 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయగా.. ఉత్తరాఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 114 పరుగులకే కుప్పకూలింది.

చదవండి: Ranji Trophy 2022: ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఫీట్‌.. బెంగాల్‌ జట్టు ప్రపంచ రికార్డు

మరిన్ని వార్తలు