MI Vs SRH: ముంబై 235 పరుగులు చేసినా...

9 Oct, 2021 05:25 IST|Sakshi

ప్లే ఆఫ్స్‌కు దూరమైన ముంబై ఇండియన్స్‌

చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై 42 పరుగులతో విజయం

చెలరేగిన ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్‌  

‘అంకెలు నన్ను భయపెడుతున్నాయి’... టాస్‌ సమయంలో రోహిత్‌ శర్మ చేసిన వ్యాఖ్య ఇది. 171 పరుగులతో గెలవడం దాదాపు అసాధ్యమనే స్థితిలో అతను ఈ మాట అన్నా... మ్యాచ్‌ తొలి భాగంలో తాము చేయగలిగిన ప్రయత్నం ముంబై చేసింది. ఇషాన్, సూర్యకుమార్‌ రెచ్చిపోవడంతో ఏకంగా ఐపీఎల్‌ చరిత్రలోనే తమ అత్యధిక స్కోరు 235 పరుగులను నమోదు చేసింది.  హైదరాబాద్‌ను 65 లేదా అంతకంటే తక్కువ స్కోరుకు ఆపితే ప్లే ఆఫ్స్‌ అవకాశం ఉండగా... 5.5 ఓవర్‌ వద్ద రైజర్స్‌ 66వ పరుగు తీయడంతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ కథ ముగిసింది. చివరకు మ్యాచ్‌లో గెలుపు దక్కగా... సన్‌రైజర్స్‌ ఆఖరి స్థానంతో లీగ్‌ను ముగించింది. 
 
అబుదాబి: ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలు కోల్పోయినా... అద్భుత ఆటతో ముంబై ఇండియన్స్‌ అభిమానులను అలరించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించింది.  ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (32 బంతుల్లో 84; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (40 బంతుల్లో 82; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. హోల్డర్‌కు 4 వికెట్లు దక్కగా... నబీ 5 క్యాచ్‌లు అందుకొని ఐపీఎల్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఫీల్డర్‌గా నిలిచాడు. అనంతరం రైజర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు చేసి ఓడిపోయింది. కెపె్టన్‌ మనీశ్‌ పాండే (41 బంతుల్లో 69 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా... అభిషేక్‌ శర్మ (16 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్‌), జేసన్‌ రాయ్‌ (21 బంతుల్లో 34; 6 ఫోర్లు) రాణించారు.  

ఇషాన్, సూర్య సూపర్‌...
72 బంతుల్లో (12 ఓవర్లు) ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్‌ యాదవ్‌ కలిపి 230.56 స్ట్రయిక్‌రేట్‌తో 166 పరుగులు చేయగా, మిగతా ముంబై జట్టు 48 బంతుల్లో (8 ఓవర్లు) 120.83 స్ట్రయిక్‌రేట్‌తో 58 పరుగులు చేసింది... ఇదీ వీరిద్దరు ఎంత దూకుడుగా ఆడారో చూపిస్తోంది. కనీసం 250 పరుగులు చేయాలనే లక్ష్యంగా బరిలోకి దిగిన ముంబై దాదాపుగా ఆ స్కోరుకు చేరువగా వచ్చింది. రోహిత్‌ శర్మ (18)ను మరో ఎండ్‌లో నిలబెట్టి ఇషాన్‌ చెలరేగిపోయాడు. తొలి ఓవర్లో సిక్స్‌తో మొదలు పెట్టిన అతను కౌల్‌ వేసిన తర్వాతి ఓవర్లో 4 ఫోర్లు కొట్టాడు. నబీ వేసిన మూడో ఓవర్లో మళ్లీ మూడు ఫోర్లు బాదగా... హోల్డర్‌ ఓవర్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌లతో ముంబై 22 పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో 2021 సీజన్‌లో వేగవంతమైన అర్ధసెంచరీ (16 బంతుల్లో)ని ఇషాన్‌ నమోదు చేశాడు. పవర్‌ప్లే ముగిసేసరికే స్కోరు 83 పరుగులకు చేరింది. ఆ తర్వాత కూడా మరో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టిన ఇషాన్‌ను ఎట్టకేలకు ఉమ్రాన్‌ మాలిక్‌ అవుట్‌ చేయడంతో రైజర్స్‌ ఊపిరి పీల్చుకుంది. అయితే ఆ తర్వాత సూర్యకుమార్‌ జోరు మొదలైంది. ఏ బౌలర్‌నూ వదిలి పెట్టకుండా అతను కూడా చెలరేగిపోయాడు. కౌల్‌ ఓవర్లో మూడు ఫోర్లు బాదడంతో 24 బంతుల్లోనే సూర్య హాఫ్‌ సెంచరీ కూడా పూర్తయింది. ఇంత విధ్వంసం తర్వాత హోల్డర్‌ వేసిన చివరి ఓవర్లో ముంబైకి ఐదు పరుగులే వచ్చాయి!  

రాణించిన పాండే...
అనూహ్యంగా ఆసక్తి రేపిన పోరులో ఒక్కసారిగా ముంబై ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలకు తెర పడిన తర్వాత మిగిలింది లాంఛనమే అయిపోయింది. రాయ్, అభిõÙక్‌ కొన్ని చక్కటి షాట్లతో 32 బంతుల్లోనే 64 పరుగులు జోడించారు. ఆపై రైజర్స్‌ ఎప్పటిలాగే మిడిలార్డర్‌లో తమ పేలవ ప్రదర్శనను కొనసాగించింది. ఓపెనర్లు వెంటవెంటనే వెనుదిరగ్గా, మూడు పరుగుల వ్యవధిలో నబీ (3), సమద్‌ (2) కూడా అవుటయ్యారు. ఈ దశలో పాండే, గార్గ్‌ (29; 2 ఫోర్లు, 1 సిక్స్‌) 36 బంతుల్లోనే 56 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. అయితే రైజర్స్‌ వరుసగా వికెట్లు కోల్పోవడంతో మరో ఎండ్‌లో పాండే పోరాడినా ఫలితం లేకపోయింది.  

స్కోరు వివరాలు  
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) నబీ (బి) రషీద్‌ 18; ఇషాన్‌ కిషన్‌ (సి) సాహా (బి) ఉమ్రాన్‌ 84; హార్దిక్‌ (సి) రాయ్‌ (బి) హోల్డర్‌ 10; పొలార్డ్‌ (సి) రాయ్‌ (బి) అభిషేక్‌ 13; సూర్యకుమార్‌ (సి) నబీ (బి) హోల్డర్‌ 82; నీషమ్‌ (సి) నబీ (బి) అభిõÙక్‌ 0; కృనాల్‌ (సి) నబీ (బి) రషీద్‌ 9; కూల్టర్‌నైల్‌ (సి) నబీ (బి) హోల్డర్‌ 3; చావ్లా (సి) సమద్‌ (బి) హోల్డర్‌ 0; బుమ్రా (నాటౌట్‌) 5; బౌల్ట్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 11, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 235. 
వికెట్ల పతనం: 1–80, 2–113, 3–124, 4–151, 5–151, 6–184, 7–206, 8–230, 9–230.
బౌలింగ్‌: నబీ 3–0–33–0, కౌల్‌ 4–0–56–0, హోల్డర్‌ 4–0–52–4, ఉమ్రాన్‌ 4–0–48–1, రషీద్‌ 4–0–40–2, అభిõÙక్‌ 1–0–4–2.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ (సి) కృనాల్‌ (బి) బౌల్ట్‌ 34; అభిõÙక్‌ (సి) కూల్టర్‌ నైల్‌ (బి) నీషమ్‌ 33; పాండే (నాటౌట్‌) 69; నబీ (సి) పొలార్డ్‌ (బి) చావ్లా 3; సమద్‌ (సి) పొలార్డ్‌ (బి) చావ్లా 2; గార్గ్‌ (సి) హార్దిక్‌ (బి) బుమ్రా 29; హోల్డర్‌ (సి) బౌల్ట్‌ (బి) కూల్టర్‌ నైల్‌ 1; రషీద్‌ (సి అండ్‌ బి) బుమ్రా 9; సాహా (సి అండ్‌ బి) కూల్టర్‌నైల్‌ 2; కౌల్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 10, మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–64, 2–79, 3–97, 4–100, 5–156, 6–166, 7–177, 8–182.
బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–30–1, బుమ్రా 4–0–39–2, చావ్లా 4–0–38–1, కూల్టర్‌ నైల్‌ 4–0–40–2, నీషమ్‌ 3–0–28–2, కృనాల్‌ 1–0–16–0.  

మరిన్ని వార్తలు