నాలో ఆత్మవిశ్వాసానికి ఆ నలుగురు కారణం: ఇషాన్‌ కిషన్‌

6 Oct, 2021 18:42 IST|Sakshi
Courtesy: IPL

షార్జా: ముంబై ఇండియన్స్‌ యువ సంచలనం ఇషాన్‌ కిషన్‌ రాజస్తాన్‌ రాయల్స్‌తో  జరిగిన మ్యాచ్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. 25 బంతుల్లోనే 50 పరుగులు చేసిన ఇషాన్‌.. 5 ఫోర్లు, 3 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చేలరేగిపోయాడు. ఇషాన్‌ కిషన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ముంబై విజయంలో కీలకపాత్ర పోషించింది. వరుసగా విఫలమవుతున్న సందర్భంలో కొన్ని మ్యాచ్‌ల్లో కిషన్‌ చోటు కూడా దక్కించుకోలేదు. ఈ క్రమంలో  బాధతో కుంగిపోయిన తనలో నలుగురు సీనియర్ ఆటగాళ్లు, మద్దతుగా నిలిచారని అతడు తెలిపాడు. ముఖ్యంగా విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ,  హార్ధిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్ లు తనకు విలువైన  సలహాలు, సూచనలు ఇ‍చ్చి తనలో  ఆత్మవిశ్వాసం పెంచారని  కిషన్ పేర్కొన్నాడు..

"తిరిగి మళ్లీ ఓపెనింగ్‌కు రావడం, జట్టు కోసం పరుగులు సాధించడం, జట్టు విజయంలో భారీ తేడాతో గెలవడానికి సహాయపడటం సంతోషంగా ఉంది. ఇది నిజంగా ఒక మంచి అనుభూతి. ఇది మా టీమ్  వేగంగా పుంజుకోవడానకి చాలా సహయపడుతుంది. ఏ ఆటలోనైనా క్రీడాకారుడిలో హెచ్చు తగ్గులు  సహజం  అని నేను భావిస్తున్నాను. నేను కూడా మంచి ఫామ్‌లో లేను. గత సీజన్లలో లాగా చాలా మంది బ్యాటర్లు పరుగులు చేయలేదు. మాకు గొప్ప సహాయక సిబ్బంది ఉన్నారు. నేను మా కెప్టెన్ రోహిత్‌ శర్మ, విరాట్ భాయ్, హార్దిక్ భాయ్‌తో చాట్ చేసాను ..  అందరూ నాకు మద్దతుగా  నిలిచారాని "అని మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో  ఇషాన్ వెల్లడించాడు.

చదవండి: IPL 2021: ఇలా గెలిస్తే ముంబై ఇండియన్స్‌ లేదంటే కేకేఆర్‌

మరిన్ని వార్తలు