Mumbai Indians: విదేశీ లీగ్స్‌లోనూ తనదైన ముద్ర.. కొత్త జట్ల పేర్లను ప్రకటించిన ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం

10 Aug, 2022 16:12 IST|Sakshi

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు పొందింది ముంబై ఇండియన్స్‌. క్యాష్‌రిచ్‌ లీగ్‌లో అత్యధిక సార్లు(ఐదుసార్లు) ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఆధ్వర్యంలో నడుస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన జట్టుగా పేరు పొందిన ముంబై ఇండియన్స్‌ త్వరలోనే మరో రెండు ప్రైవేటు లీగ్స్‌లో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్న యూఏఈ టి20 లీగ్‌లో ఒక జట్టును.. అదే సమయంలో క్రికెట్‌ సౌతాఫ్రికా నిర్వహించనున్న సీఎస్‌కే టి20 లీగ్‌లో మరొక జట్టును(న్యూ లాండ్స్‌, కేప్‌టౌడ్‌) కొనుగోలు చేసింది. తాజాగా ఆ జట్లకు సంబంధించిన పేర్లను రివీల్‌ చేసింది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌. ముంబై ఇండియన్స్ బ్రాండ్ ను అలాగే ఉంచుతూ యూఏఈ లో కొనుగోలు చేసిన ఫ్రాంచైజీకి ముంబై ఎమిరేట్స్‌(MI Emirates) గా నామకరణం చేసింది. ఇక సౌతాఫ్రికా టి20 లీగ్‌లో కేప్ టౌన్ ఫ్రాంచైజీని దక్కించుకున్న అంబానీ దానికి ముంబై కేప్‌టౌన్‌ (MI Cape Town) అని పేరును పెట్టింది. ఈ రెండు పేర్లలో కామన్ గా ఉన్న బ్రాండ్ ముంబై(ఎంఐ-MI). 

ఫ్రాంచైజీల పేర్లతో పాటు అందులో పాల్గొననున్న ఆటగాళ్లు కూడా ముంబై ఇండియన్స్‌ జెర్సీలను ఆటగాళ్లు ధరించనున్నారు. ముంబై ఇండియన్స్  జెర్సీ బ్లూ, గోల్డ్  లతో కలగలిసిన దుస్తులే యూఏఈ, సౌతాఫ్రికా క్రికెట్ లీగ్ లలో కనిపించనున్నారు. కేవలం లోగో మాత్రమే మారనుంది. ఈ మేరకు  ముంబై ఇండియన్స్.. తన   ట్విటర్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. 

ఇదే విషయమై నీతా అంబానీ మాట్లాడుతూ.. ‘మా ఫ్యామిలీలోకి  సరికొత్త  ఫ్రాంచైజీలు 'ముంబై ఎమిరేట్స్'.. 'ముంబై కేప్ టౌన్'ను స్వాగతించడం  చాలా సంతోషాన్నిస్తుంది.ఎంఐ అనే పేరుతో మాకు క్రికెట్‌కు మించిన అనుబంధం ఉంది. మా తాజా ఫ్రాంచైజీలు కూడా ఎప్పటిలాగే ఒకే నైతికతను స్వీకరిస్తాయి. ఎంఐ స్థాయిని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తాయని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

సీఎస్‌ఏ టి20 లీగ్‌లో మొత్తం ఆరుజట్లు ఉండగా.. అన్నింటిని ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. తాజాగా కేప్‌టౌన్‌ను కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్‌.. ముంబై కేప్‌టౌన్‌గా నామకరణం చేసింది. ఇక మిగతా జట్లను పరిశీలిస్తే జొహన్నెస్‌బర్గ్‌ను సీఎస్‌కే, సెంచూరియన్‌, పార్ల్‌, డర్బన్‌,పోర్ట్ ఎలిజబెత్ ఫ్రాంచైజీలను ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌,లక్నో సూపర్‌ జెయింట్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దక్కించుకున్నాయి.

చదవండి: The Hundred League 2022: దంచికొట్టిన డేవిడ్‌ మలాన్‌.. దూసుకుపోతున్న ట్రెంట్‌ రాకెట్స్‌

Sanju Samson: 'మరి అంత పనికిరాని వాడా?.. బీసీసీఐ కావాలనే చేస్తోంది'

మరిన్ని వార్తలు