ఫుల్‌ స్వింగ్‌లో రోహిత్‌..

27 Oct, 2020 16:30 IST|Sakshi

అబుదాబి:  వచ్చే నెల చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా జట్టును ఆదివారం బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేయగా,  అందులో హిట్‌మ్యాచ్‌ రోహిత్‌ శర్మకు చోటు దక్కలేదు. మూడు ఫార్మాట్లలోనూ రోహిత్‌ను పరిగణలోకి తీసుకోలేకపోవడంతో అతని ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ కల్గించింది.  ఆసీస్‌ పర్యటనకు అంత ఆగమేఘాలపై జట్టును ఎంపిక చేయాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న తలెత్తింది. (సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు మూకుమ్మడి రాజీనామా)

ప్రస్తుతం తొడకండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్‌ శర్మ.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ ఆడిన గత రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌ తర్వాత రోహిత్‌ మళ్లీ ఆడలేదు. సూపర్‌ ఓవర్‌కు దారి తీసిన ఆ మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైంది. దాంతో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మాట్లాడటానికి కూడా రోహిత్‌ రాలేదు. అతని స్థానంలో కీరోన్‌ పొలార్డ్‌ వచ్చాడు. ఆపై రెండు మ్యాచ్‌లకు పొలార్డే ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. పొలార్డ్‌ కెప్టెన్‌గా చేసిన గత రెండు మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో ముంబై గెలవగా, మరొక మ్యాచ్‌లో ఓడింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ 11 మ్యాచ్‌లకు గాను 7 విజయాలు సాధించింది. 

ఫుల్‌ స్వింగ్‌లో రోహిత్‌..
మళ్లీ రోహిత్‌ బరిలోకి దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. రేపు(బుధవారం) ఆర్సీబీతో జరుగనున్న మ్యాచ్‌లో రోహిత్‌ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తాజాగా రోహిత్‌ శర్మ ప్రాక్టీస్‌ చేస్తున్న విధానం అతని రాకను బలపరుస్తోంది. రోహిత్‌ శర్మ ఫుల్‌ స్వింగ్‌లో తన ప్రాక్టీస్‌ను ఆరంభించాడు.  నెట్స్‌లో తీవ్రంగా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూ భారీ షాట్లతో అలరించాడు. ఈ మేరకు రోహిత్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోను ముంబై ఇండియన్స్‌ తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. (వారిదే టైటిల్‌.. ఆర్చర్‌ జోస్యం నిజమయ్యేనా?)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు