ముంబై 18.. ఆర్సీబీ 9

28 Sep, 2020 19:08 IST|Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌-13లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌... ముందుగా ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు..  ఇప్పటివరకూ రెండు మ్యాచ్‌లు ఆడిన డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. సీఎస్‌కేతో జరిగిన ఆరంభపు మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైంది. ఇక కేకేఆర్‌తో ఆడిన తన రెండో మ్యాచ్‌లో ముంబై 49 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించగా, కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఇక ముంబై-ఆర్సీబీల మధ్య ఇప్పటివరకూ 27 మ్యాచ్‌లు జరిగాయి. అందులో ముంబై 18 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, ఆర్సీబీ 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.  ఆర్సీబీపై ముంబై ఇండియన్స్‌ ఛేజ్‌ చేసిన అత్యధిక స్కోరు 171 కాగా, ఆర్సీబీ కాపాడుకున్న అత్యల్ప స్కోరు 156.  ఇది టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా కోహ్లికి 150వ మ్యాచ్‌. కోహ్లికి ఇది మైలురాయి మ్యాచ్‌ కావడంతో ఏమైనా మెరుపులు వస్తాయేమో చూడాలి.(చదవండి: తెవాటియా.. ఐయామ్ వెరీ సారీ: మాజీ చీఫ్‌ సెలక్టర్‌)

ఆల్‌రౌండర్ల పాత్ర ఎంతవరకూ..
ముంబై ఇండియన్స్‌-ఆర్సీబీ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్లు ఎంతవరకూ రాణిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ముంబై ఇండియన్స్‌ జట్టులో హార్దిక్‌ పాండ్యా ఉన్నా ఇప్పటివరకూ బౌలింగ్‌ చేయలేదు. దాంతో అతను పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా ముంబైకు ఉపయోగపడలేదు.ఇక పొలార్డ్‌పై ముంబై ఆశలు పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో పొలార్డ్‌ ఆల్‌రౌండర్‌ రోల్‌లో మెరిస్తే ముంబై తిరిగి గాడిలో పడుతుంది. ఇక ఆర్సీబీని ఆల్‌రౌండర్‌ పాత్ర వేధిస్తోంది. శివం దూబే రూపంలో ఆర్సీబీకి ఆల్‌రౌండర్‌ ఉన్నా అతనిపై నమ్మకం ఉంచడం కత్తిమీద సామే. ఆర్సీబీ ఆడిన గత మ్యాచ్‌లో దూబే ఫైనల్‌ ఓవర్‌ వేసి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

కోహ్లి రాణిస్తాడా?
ఈ మ్యాచ్‌లోనైనా విరాట్‌ కోహ్లి రాణిస్తాడనే ఆశతో ఉన్నారు ఆర్సీబీ అభిమానులు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో  మ్యాచ్‌లో 14 పరుగులు చేసిన కోహ్లి.. కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో ఒక పరుగే చేశాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కూడా కోహ్లికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆరంభపు ఓవర్లలో మిచెల్‌ మెక్లీన్‌గన్‌, ధావల్‌ కులకర్ణిలతో కోహ్లికి ముప్పు ఉంది. గత రికార్డులు చూస్తే కోహ్లి వీరిపై రాణించిన దాఖలాలు తక్కువ. ఒకవేళ వీరిని ఆచితూచి ఆడి మ్యాచ్‌ మధ్యలో ట్రెంట్‌ బౌల్ట్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటే కోహ్లి భారీ స్కోరు చేసే అవకాశం ఉంది.

తుదిజట్లు

ఆర్సీబీ
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), దేవదూత్‌ పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌, ఏబీ డివిలియర్స్‌, శివం దూబే, వాషింగ్టన్‌ సుందర్‌, ఇసుర ఉదాన, గుర్‌కీరత్‌ సింగ్‌మన్‌, నవదీప్‌ సైనీ, చహల్‌, ఆడమ్‌ జంపా

ముంబై ఇండియన్స్‌
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, డీకాక్‌, హార్దిక్‌ పాండ్యా, కీరోన్‌ పొలార్డ్‌, కృనాల్‌ పాండ్యా, రాహుల్‌ చాహర్‌, జేమ్స్‌ పాటిన్‌సన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా

Poll
Loading...
మరిన్ని వార్తలు