ప్లేఆఫ్‌ బెర్త్‌ ఎవరు ఖరారు చేసుకుంటారో..

28 Oct, 2020 19:15 IST|Sakshi

అబుదాబి : ఐపీఎల్‌ 13వ సీజన్‌ ముగింపు దశకు వస్తుండడంతో ప్లేఆఫ్స్‌కు ముందుగా ఏ జట్టు చేరుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో భాగంగా పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్‌, ఆర్‌సీబీ మధ్య అబుదాబి వేదికగా ఆసక్తికర పోరు జరగనుంది. కాగా టాస్‌ గెలిచిన ముంబై బౌలింగ్‌ ఎంచుకుంది.కాగా ఈ మ్యాచ్‌లోనూ రోహిత్‌ శర్మ బరిలోకి దిగకపోవడంతో పొలార్డ్‌ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.(చదవండి : శామ్యూల్స్‌కు మతి చెడింది : వార్న్‌)

ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తే వారు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలోకి వెళ్లడం మాత్రమే కాకుండా ప్లే ఆఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి జట్టుగా నిలుస్తుంది.ముంబై జట్టులో ఎలాంటి మార్పులు లేకపోగా.. ఆర్‌సీబీ మాత్రం మూడు మార్పులు చేసింది.  నవదీప్‌ సైనీ స్థానంలో శివమ్‌ దూబే, అరోన్‌ ఫించ్‌ స్థానంలో జోష్‌ ఫిలిఫ్‌, మొయిన్‌ అలీ స్థానంలో డేల్‌ స్టెయిన్‌లను జట్టులోకి తీసుకున్నట్లు కెప్టెన్‌ కోహ్లీ వివరించాడు. కాగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి అంచె పోటీలో ఆర్‌సీబీ సూపర్‌ ఓవర్‌ ద్వారా ముంబైపై విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య ఐపీఎల్‌లో ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు జరగ్గా.. ముంబై 18, ఆర్‌సీబీ 10 విజయాలు నమోదు చేశాయి.

బెంగళూరు : విరాట్ కోహ్లీ(కెప్టెన్‌),దేవదత్ పడిక్కల్, జోష్ ఫిలిప్, ఎబి డివిలియర్స్, గుర్కీరత్ సింగ్ మన్, శివం దుబే, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్, డేల్ స్టెయిన్, మహ్మద్ సిరాజ్, యుజువేంద్ర చాహల్

ముంబై : ఇషాన్ కిషన్, క్వింటన్ డి కాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్ (కెప్టెన్‌), కృనాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు