'ధోని ఎంపిక లెక్కలకు అందని సూత్రం'

21 Aug, 2020 11:19 IST|Sakshi

చెన్నై : ఎంఎస్‌ ధోని సారధ్యంలో ఏ మాత్రం అంచనాలు లేకుండా అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్‌ను గెలిచి రికార్డు సృష్టించింది. ఈ గెలుపే బీసీసీఐకి కాసుల పంట పండిస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)కు పునాది పడింది. అప్పటికే భారత జట్టులో స్టార్‌ ఆటగాళ్లుగా ఉన్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌లను ఐకానిక్‌ ఆటగాళ్లుగా గుర్తించారు. అప్పటి రైజింగ్‌ స్టార్‌గా ఉన్న ఎంఎస్‌ ధోనికి ఐకానిక్‌ హోదా లేదు.(చదవండి : థ్యాంక్యూ నరేంద్ర మోదీజీ : రైనా)

ఇందులో ఒక్క ధోని మినహా మిగతా ఐదుగురు ఐకానిక్‌ హోదాలో సొంతజట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. సచిన్‌( ముంబై ఇండియన్స్‌), గంగూలీ(కోల్‌కతా నైట్‌రైడర్స్‌), రాహుల్‌ ద్రవిడ్‌(రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు), యువరాజ్‌(కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌), సెహ్వాగ్‌ (ఢిల్లీ డేర్‌డేవిల్స్‌)  ఉన్నారు. దేశానికి 2007 టీ 20 ప్రపంచకప్‌ సాధించిపెట్టిన ధోని క్రేజ్‌ వేరుగా ఉండేది. అయితే ధోని పుట్టిపెరిగిన రాంచీ నుంచి ఏ ఫ్రాంచైజీ లేదు.. దీంతో అతను వేలంలోకి వచ్చాడు. కాగా వేలంలో ధోని కోసం అన్ని ఫ్రాంచైజీలు గట్టిగానే ప్రయత్నించగా.. చివరకు చెన్నై సూపర్‌కింగ్స్‌ దక్కించుకొంది. ఆ తర్వాత ఏం జరిగందన్నది మీకందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ యజమాని, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌. శ్రీనివాసన్‌ ధోని గురించి, చైన్నై జట్టు తనను వేలంలో ఎలా దక్కించుకున్న విషయాలను పీటీఐ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. 

ఆయన మాట్లాడుతూ.. 'మొదటి ఐపీఎల్‌ సీజన్‌ వేలం పాట సందర్భంగా.. యువరాజ్‌ను పంజాబ్‌ను కోరుకుంది.. వీరును ఢిల్లీ వదులకోదు.. ఇక సచిన్‌ లేకండా ముంబై జట్టును చూడలేము.. దాదా లేకపోతే.. కోల్‌కతా జట్టే ఉండదు.. అందులోనూ ఆయా ఫ్రాంచైజీలు ఐకానిక్‌ హోదా ఉన్న ఆటగాళ్లు సొంత జట్టుకే ఆడాలని తీర్మానం చేశాయి. ఐకానిక్‌ హోదాలో వీరికి అందరికంటే ఎక్కువ మొత్తం లభిస్తుంది. ధోనికి ఐకానిక్‌ హోదా లేదు.. కానీ స్టార్‌ హోదా ఉంది. అందుకే అతని కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. దీంతో ధోని రేటు అమాంతం పెరిగిపోయింది.(చదవండి : సిరీస్‌ ఫలితాన్నే మార్చేసిన స్టన్నింగ్‌ క్యాచ్‌)

కానీ ఎలాగైనా ధోనిని దక్కించుకోవాలనే తపనతో వేలంలో ఎంతోదూరం వెళ్లా.. చివరకు చైన్నైకి ధోనిని తీసుకొచ్చి కెప్టెన్‌ను చేశా. అప్పడు నేను ఒక్కేటే అనుకున్నా..  మాకు ఐకానిక్‌ ఆటగాడు అవసరం లేదు.. జట్టును స్థిరంగా నడిపించే నాయకుడు చాలు.. అందుకే ధోనిని తమ ఫ్రాంచైజీలోకి తీసుకొని కెప్టెన్‌ను చేశాము. అందుకే ఇప్పటికి స్పష్టంగా చెబుతా.. ధోని ఎంపిక లెక్కలకు అందని సూత్రం అని. ' అంటూ చెప్పుకొచ్చాడు.

ధోని నాయకత్వంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు ఐపీఎల్‌ చరిత్రలో విజయవంతమైన జట్టుగా పేరుపొందింది. ఇప్పటికే మూడుసార్లు టైటిల్‌ను కొల్లగొట్టిన చెన్నై రెండు సార్లు చాంపియన్‌ లీగ్స్‌ను గెలిచింది. అంతేకాదు.. ఐపీఎల్‌ సీజన్లలో 8సార్లు ఫైనల్‌ చేరిన జట్టుగా, ఎక్కువసార్లు  ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు ఆడిన జట్టుగా చరిత్ర సృష్టించింది.(చదవండి : యూఏఈలో పెరుగుతున్న కేసులు.. మరి ఐపీఎల్‌)

మరిన్ని వార్తలు