ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌కు నాదల్‌ దూరం   

8 Jan, 2024 04:20 IST|Sakshi

స్పెయిన్‌ దిగ్గజ టెన్నిస్‌ ప్లేయర్‌ రాఫెల్‌ నాదల్‌ ఈనెల 14 నుంచి 28 వరకు జరిగే సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగాడు. కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన 37 ఏళ్ల నాదల్‌ గత ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తర్వాత తుంటి గాయంతో ఏడాదిపాటు ఆటకు దూరమయ్యాడు.

గతవారం బ్రిస్బేన్‌ ఓపెన్‌ టోర్నీతో నాదల్‌ పునరాగమనం చేశాడు. ఈ టోర్నీ లో జోర్డాన్‌ థాంప్సన్‌ (ఆస్ట్రేలియా)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయిన నాదల్‌ ఈ మ్యాచ్‌ సందర్భంగా ఎడమ కాలి కండరాల గాయానికి గురయ్యాడు. 
 

>
మరిన్ని వార్తలు