ప్రపంచకప్‌కు నమీబియా క్వాలిఫై 

29 Nov, 2023 03:43 IST|Sakshi

వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌కు నమీబియా జట్టు అర్హత సాధించింది. ఆఫ్రికా రీజియన్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌లలో విజయం సాధించి అగ్ర స్థానం ఖాయం చేసుకోవడంతో ఆ జట్టు వరల్డ్‌ కప్‌కు క్వాలిఫై అయింది. మంగళవారం జరిగిన పోరులో నమీబియా 58 పరుగుల తేడాతో టాంజానియాను ఓడించింది. నమీబియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 157 పరుగులు చేసింది.

జేజే స్మిట్‌ (40), మైకేల్‌ లింజెన్‌ (30) రాణించారు. అనంతరం టాంజానియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 99 పరుగులే చేయగలిగింది. అమాల్‌ రాజీవన్‌ (41 నాటౌట్‌) మినహా అంతా విఫలమయ్యారు. వరుసగా మూడో టి20 ప్రపంచకప్‌కు (2021, 2022, 2024) నమీబియా అర్హత సాధించడం విశేషం.

ఇదే టోర్నీలో జరిగిన మరో మ్యాచ్‌లో రువాండాపై 144 పరుగులతో గెలిచిన జింబాబ్వే తాము కూడా క్వాలిఫై అయ్యే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. 2024 జూన్‌లో వెస్టిండీస్, అమెరికా ఈ టి20 ప్రపంచకప్‌కు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.     
 

మరిన్ని వార్తలు