మీడియాతో మాట్లాడేది లేదు!

28 May, 2021 03:12 IST|Sakshi

ఫ్రెంచ్‌ ఓపెన్‌కు ముందు జపాన్‌ స్టార్‌ నవోమీ ఒసాకా సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నడూ లేని విధంగా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లకు హాజరు కానని ప్రకటించింది. ఆటగాళ్లను బాధపెట్టే విధంగా మీడియా అడిగే ప్రశ్నలు తమ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని చెప్పింది. గ్రాండ్‌స్లామ్‌ నిబంధనల ప్రకారం మీడియా సమావేశానికి హాజరు కాకపోతే 20 వేల డాలర్లు (సుమారు రూ. 15 లక్షలు) జరిమానా విధించే అవకాశం ఉండగా...అందుకు తాను సిద్ధమని ప్రకటించింది.   

మరిన్ని వార్తలు