Naomi Osaka: 'ఇక నుంచి నన్ను అలా పిలవండి'

25 Dec, 2021 17:07 IST|Sakshi

మహిళల టెన్నిస్‌ సూపర్‌ స్టార్‌ నయామి ఒసాకా తన బ్రేక్‌టైమ్‌ను ఫుల్‌ స్వింగ్‌తో ఆస్వాధిస్తోంది. ఇటీవలే జరిగిన యూఎస్‌ ఓపెన్‌లో మూడోరౌండ్‌లోనే ఇంటిబాట పట్టిన ఒసాకా కొంతకాలం టెన్నిస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. దొరికిన సమయాన్ని చక్కగా ఎంజాయ్‌ చేస్తున్న ఒసాకా తనకిష్టమైన వంటల్లో వివిధ రకాల ప్రయోగాలు చేస్తూ వాటికి గమ్మత్తైన పేర్లు పెడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంటుంది. తాజాగా వాగ్యూ కాస్తూ అనే జపనీస్‌ కర్రీనీ వండిన ఒసాకా దానిని ఇన్‌స్టాలో పంచుకుంటే.. ఈరోజు మీ ముందుకు వాగ్యా కాస్తూ జపనీస్‌ కర్రీనీ తీసుకొచ్చాడు.. కానీ అది సరిగా కుదిరిందో లేదో చూడాలి.. ఇకపై నన్ను  ''చెఫ్‌ బొయార్డీ'' అని పిలవండి. అంటూ క్యాప్షన్‌ జత చేసింది. 

చదవండి: గోవాలో ఎంజాయ్‌ చేస్తున్న సారా... బ్రేకప్‌ చెప్పేశారా అంటూ నెటిజన్ల ట్రోల్స్‌!

ఇక ఈ ఏడాది ఒసాకాకు పెద్దగా కలిసిరాలేదు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను రెండోసారి గెలిచిన ఒసాకా 2021 ఏడాదిని ఘనంగానే ఆరంభించింది. అయితే ఆ తర్వాత జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. ఆరోగ్య సమస్యలతో వింబుల్డన్‌ నుంచి పక్కకు తప్పుకుంది. ఆ తర్వాత ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో మూడోరౌండ్‌లోనే వెనుదిరిగి నిరాశ పరిచింది. ఇక 24 ఏళ్ల ఒసాకా తన టెన్నిస్‌ కెరీర్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ అందుకుంది. ఇటీవలే టైమ్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన  ''2021లో అత్యంత ప్రభావితం చేసిన 100 మంది వ్యక్తులు'' జాబితాలో నయామి ఓసాకా చోటు దక్కించుకోవడం విశేషం.


 

మరిన్ని వార్తలు