ప్రపంచకప్‌కు నసీమ్‌ షా దూరం! 

17 Sep, 2023 01:45 IST|Sakshi

వచ్చే నెలలో భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందే పాకిస్తాన్‌ జట్టుకు గట్టి దెబ్బ తగిలే అవకాశముంది. ఆ జట్టు యువ పేస్‌ బౌలర్‌ నసీమ్‌ షా ఈ మెగా ఈవెంట్‌ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఆసియా కప్‌ టోర్నీలో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా నసీమ్‌ షా భుజానికి గాయమైంది. ఈ గాయానికి స్కాన్‌లు నిర్వహించారు. గాయం తీవ్రతదృష్ట్యా నసీమ్‌ షా మూడు నెలలు ఆటకు దూరమయ్యే అవకాశముందని తెలిసింది. 20 ఏళ్ల నసీమ్‌ పాక్‌ తరఫున 14 వన్డేలు ఆడి 32 వికెట్లు తీశాడు.  

మరిన్ని వార్తలు