Asia Cup 2022: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో భారీ షాక్‌!

29 Aug, 2022 13:30 IST|Sakshi
PC: PCB twitter

భారత్‌ చేతిలో ఓటమి బాధ నుంచి కోలుకోక ముందే పాకిస్తాన్‌కు భారీ షాక్‌ తగిలే అవకాశముంది. టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో గాయ పడ్డ పాక్‌ పేసర్‌ నసీమ్‌ షా.. హాంకాంగ్‌తో జరగబోయే తమ తదుపరి మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో నసీమ్‌ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో 27 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు.

కాగా భారత్‌ ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌ వేసే క్రమంలో నసీమ్ షా పాదానికి గాయమైంది. అయినప్పటికీ ఓ వైపు బాధను దిగమింగుతూ తన ఓవర్‌ను నసీమ్‌ షా పూర్తి చేశాడు. మ్యాచ్‌ అనంతరం అతడిని స్కానింగ్‌ కోసం అస్పత్రికి తరలించినట్లు సమాచారం. అయితే అతడి గాయం అంత తీవ్రమైనది కానప్పటికీ.. వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పటికే గాయం కారణంగా షాహిన్‌ షా ఆఫ్రిది, మహ్మద్‌ వసీం సేవలను పాకిస్తాన్ కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ  క్రమంలో నసీమ్‌ గాయం పాకిస్తాన్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక పాకిస్తాన్‌ తమ తదుపరి మ్యాచ్‌లో సెప్టెంబర్‌ 2న హాంకాంగ్‌తో తలపడనుంది.


చదవండి: Hardik Pandya: సిక్సర్‌తో హార్దిక్‌ ఫినిషింగ్‌! ‘టేక్‌ ఏ బో’ అన్న డీకే! వీడియో వైరల్‌
            Asia cup 2022: అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు! మమ్మల్ని నిరాశ పరచలేదు!

మరిన్ని వార్తలు