Mary Kom: ఎవ్వరికీ ఆ ఛాన్స్‌ లేదు.. కానీ ఆమెకు మాత్రం మినహాయింపు?!

19 Oct, 2021 08:54 IST|Sakshi

Mary Kom And Lovlina Borgohain: హిస్సార్‌లో ఈనెల 21 నుంచి జరిగే జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనడం లేదని భారత స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ తెలిపింది. జాతీయ చాంపియన్‌షిప్‌లో విజేతలుగా నిలిచిన వారిని మాత్రమే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపిక చేస్తామని భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎఫ్‌ఐ) ప్రకటించింది. అయితే మేరీకోమ్‌ పాల్గొనే 48–51 కేజీల విభాగానికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని బీఎఫ్‌ఐ భావిస్తోంది. 

కాగా 2012 లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత.. ఆరుసార్లు వరల్డ్‌ చాంపియన్‌ అయిన మేరీ కోమ్‌... ఇటీవలి టోక్యో ఒలిపింక్స్‌లో క్వార్టర్స్‌ చేరకుండానే రెండో రౌండ్‌లోనే తిరుగుముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే, మరో భారత మహిళా బాక్సర్‌ 23 ఏళ్ల లవ్లీనా బొర్గోహెయిన్‌.. కంచు పంచ్‌తో కాంస్యం సాధించి విశ్వవేదికపై సత్తా చాటింది. ఈ ప్రదర్శన ఆధారంగా ఆమె వరల్డ్‌ ఈవెంట్‌(69 కేజీల విభాగం)కు నేరుగా సెలక్ట్‌ అయింది.

చదవండి: T20 WC: ఇం‍గ్లండ్‌పై కోహ్లి సేన విజయం; ఏయ్‌.. మైకేల్‌ ఆఫ్‌లైన్‌లో ఉన్నావ్‌ ఏంది?!

మరిన్ని వార్తలు