మన అమ్మాయిలు భేష్‌: నందినికి స్వర్ణం.. దీప్తికి రజతం.. రజితకు కాంస్యం

4 Jun, 2022 08:19 IST|Sakshi
స్వర్ణ, రజత, కాంస్య పతకాల విజేతలు నందిని, దీప్తి, రజిత

సాక్షి, హైదరాబాద్‌: ఫెడరేషన్‌ కప్‌ జాతీయ అండర్‌–20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో శుక్రవారం తెలంగాణ మహిళా అథ్లెట్స్‌ అగసార నందిని స్వర్ణం, జీవంజి దీప్తి రజతం... ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి కుంజ రజిత కాంస్యం సాధించారు. గుజరాత్‌లో జరుగుతున్న ఈ మీట్‌లో నందిని 100 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌ రేసును 13.97 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది.

ఈ ప్రదర్శనతో నందిని కొలంబియాలో ఆగస్టు 1 నుంచి 6 వరకు జరిగే ప్రపంచ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు అర్హత సాధించింది. దీప్తి 100 మీటర్ల ఫైనల్‌ రేసును 12.17 సెకన్లలో ముగించి రెండో స్థానాన్ని దక్కించుకుంది. రజిత 400 మీటర్ల ఫైనల్‌ రేసును 56.32 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానాన్ని సంపాదించింది. నందిని, దీప్తి, రజిత హైదరా బాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ‘సాయ్‌’ కోచ్‌ నాగపురి రమేశ్‌ వద్ద శిక్షణ పొందుతున్నారు. 

చదవండి: Rafael Nadal: హోరాహోరీ సమరం... గాయంతో సమాప్తం

మరిన్ని వార్తలు