National Games 2022: జ్యోతి ఖాతాలో రెండో స్వర్ణం

5 Oct, 2022 12:11 IST|Sakshi

అహ్మదాబాద్‌: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ జ్యోతి యెర్రాజీ మళ్లీ మెరిసింది. ఇప్పటికే మహిళల 100 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ఈ వైజాగ్‌ అథ్లెట్‌ 100 మీటర్ల హర్డిల్స్‌ ఈవెంట్‌లోనూ బంగారు పతకం సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌ రేసును జ్యోతి 12.79 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది.

తెలంగాణకు చెందిన అగసార నందిని 13.38 సెకన్లలో గమ్యానికి చేరి రజత పతకం సాధించింది. మహిళల జావెలిన్‌ త్రోలో రష్మీ శెట్టి ఆంధ్రప్రదేశ్‌కు రజత పతకం అందించింది. రష్మీ జావెలిన్‌ను 53.95 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచింది.

టెన్నిస్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో కొసరాజు శివదీప్‌–ముని అనంత్‌మణి (ఆంధ్రప్రదేశ్‌) జోడీ కాంస్య పతకం సాధించింది. సెమీఫైనల్లో శివదీప్‌–అనంత్‌మణి ద్వయం 7–5, 3–6, 6–10తో ప్రజ్వల్‌ దేవ్‌–ఆదిల్‌ (కర్ణాటక) జోడీ చేతిలో ఓడి కాంస్యం సొంతం చేసుకుంది.
చదవండి: London Marathon: విషాదం నింపిన మారథాన్‌.. ట్రాక్‌పైనే కుప్పకూలిన అథ్లెట్‌

మరిన్ని వార్తలు