National Games 2022: ఈ బంగారు పతకం ప్రత్యేకం: ఇషా సింగ్‌

2 Oct, 2022 09:57 IST|Sakshi
స్వర్ణ పతకంతో ఇషా సింగ్‌(PC: Isha Singh Twitter)

National Games 2022: నేషనల్‌ గేమ్స్‌-2022లో మహిళల షూటింగ్‌ 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో తెలంగాణ షూటర్‌ ఇషా సింగ్‌ చాంపియన్‌గా నిలిచింది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఇషా 26 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణం దక్కించుకుంది. రిథమ్‌ సాంగ్వాన్‌ (హరియాణా; 25 పాయింట్లు) రజత పతకం, అభిద్న్యా (మహారాష్ట్ర; 19 పాయింట్లు) కాంస్యం గెలిచారు. ఈ క్రీడల్లో తెలంగాణకిది రెండో స్వరం. ఆర్టిస్టిక్‌ సింగిల్‌ ఫ్రీ స్కేటింగ్‌లో రియా సాబూ బంగారు పతకం గెలిచింది.  

ఇక జాతీయ క్రీడల్లో పసిడి పతకం గెలిచిన అనంతరం ఇషా సింగ్‌ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేనెంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. నేషనల్‌ గేమ్స్‌లో గోల్డ్‌ గెలవడం నాకెంతో ప్రత్యేకం. 

స్వర్ణం గెలిచేందుకు దగ్గరవుతున్న తరుణంలో నా మనసులో కలిగిన భావోద్వేగాల గురించి చెప్పడం కష్టం. ముఖ్యంగా చివరి రెండు షాట్లు’’ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది. అదే విధంగా ఈ ఈవెంట్‌ తన రాష్ట్రం తెలంగాణకు ఒలింపిక్స్‌ వంటిదంటూ ఉద్వేగపూరిత ట్వీట్‌ చేసింది. కాగా జూనియర్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో పసిడి గెలిచిన ఇషా సింగ్‌కు తెలంగాణ సర్కారు రూ. 2 కోట్ల నగదు బహుమతి ప్రకటించిన విషయం తెలిసిందే.

చదవండి: National Games 2022: ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత..
RSWS 2022 Final: శ్రీలంకను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడిన ఇండియా లెజెండ్స్‌.. వరుసగా రెండోసారి

మరిన్ని వార్తలు