7 వికెట్లు పడగొట్టిన అలీ.. ఐసీసీ ప్రశంసలు

29 Jan, 2021 13:15 IST|Sakshi
నౌమన్‌ అలీని అభినందిస్తున్న సహచర ఆటగాళ్లు(ఫొటో కర్టెసీ: ట్విటర్‌)

కరాచి: పాకిస్తాన్‌ అరంగేట్ర క్రికెటర్‌ నౌమన్‌ అలీ సరికొత్త రికార్డు సృష్టించాడు. పాక్‌ క్రికెట్‌ చరిత్రలో తొలి టెస్టు మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌గా నిలిచాడు. అదే విధంగా అరంగేట్రంలోనే ఈ ఘనత సాధించిన పాకిస్తాన్‌ నాలుగవ స్పిన్నర్‌గా ఘనతకెక్కాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ అతడి ప్రతిభను కొనియాడుతూ ఓ వీడియోను షేర్‌ చేసింది. కాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ నాలుగో రోజు ఆటలో భాగంగా నౌమన్‌ అలీ ఈ రికార్డు నమోదు చేశాడు. పదునైన బంతులతో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించి విజయంపై జట్టులో ఆశలు రేకెత్తించాడు. కాగా కరాచిలో మంగళవారం ప్రారంభమైన మొదటి టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగలకు ఆలౌట్‌ అయ్యింది.(చదవండి: బౌన్సర్లు ఎదుర్కోలేమంటే ఆడడం ఎందుకు?)

ప్రొటీస్‌ క్రికెటర్‌ డీన్‌ ఎల్గర్‌ అర్ధ సెంచరీతో రాణించగా... యాసిర్‌ షా 3, నౌమన్‌ అలీ, షాహిన్‌ ఆఫ్రిది చెరో 2 వికెట్లు తీశారు. ఇక పాక్‌ 378 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్‌ ముగించగా, దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. మర్‌క్రం, బవుమా(ఎల్బీడబ్ల్యూ), జార్జ్‌ లిండే, రబడ, నోట్జేలను పెవిలియన్‌కు చేర్చి నౌమన్‌ ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 7 వికెట్లు తీశాడు. ఇక లంచ్‌బ్రేక్‌ సమయానికి పాకిస్తాన్‌ విజయానికి 66 పరుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం పాక్‌ క్రికెటర్లు అబిద్‌ అలీ, ఇమ్రాన్‌ బట్‌ క్రీజులో ఉన్నారు.

మరిన్ని వార్తలు