Neeraj Chopra: చిన్న గ్యాప్‌ మాత్రమే.. ప్రపంచ రికార్డుతో ఘనంగా రీఎంట్రీ

27 Aug, 2022 07:10 IST|Sakshi
Photo Credit: AFI

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఘనంగా రీఎంట్రీ ఇచ్చాడు. గజ్జల్లో గాయంతో కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు దూరంగా ఉన్న నీరజ్‌ చోప్రా స్విట్జర్లాండ్‌లోని లుసాన్‌లో జరిగిన డైమండ్‌ లీగ్‌ మీట్‌లో మరోసారి అదరగొట్టాడు. శుక్రవారం(ఆగస్టు 26న) జరిగిన అర్హత రౌండ్‌లో తొలి ప్రయత్నంలోనే నీరజ్‌ ఈటెను 89.08 మీట్లర్ల దూరం విసిరి తొలి స్థానంలో నిలిచాడు.

ఇది అతని కెరీర్‌లో మూడో బెస్ట్‌ త్రో కావడం ఇశేషం. ఇంతకముందు ఇదే సీజన్‌లో 89.30 మీటర్లు, 89.98 మీటర్ల దూరం ఈటెను విసిరి కెరీర్‌ బెస్ట్‌ నమోదు చేశాడు. ఇక నీరజ్‌ చోప్రా వచ్చే నెలలో 7, 8 తేదీల్లో స్విట్జర్లాండ్‌లోనే డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో పాల్గొంటాడు. 

నీరజ్‌ తన తొలి ప్రయత్నంలో ఈటెను 89.08 మీటర్ల దూరం విసిరాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 85.18 మీటర్లు, మూడో ప్రయత్నంలో ఈటెను విసరలేదు. నాలుగో ప్రయత్నంలో ఫౌల్‌ చేసిన నీరజ్‌ చివరి ప్రయత్నంలో 80.04 మీటర్లు మాత్రమే విసరగలిగాడు. అయితే తనకంటే బెస్ట్‌ ఎవరు వేయకపోవడంతో నీరజ్‌ తొలి స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. గత నెలలో అమెరికాలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో నీరజ్‌ రజతం సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్‌ సందర్భంగా గాయపడటంతో నీరజ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ నుంచి వైదొలిగాడు.  

చదవండి: భారత్‌పై ‘ఫిఫా’ నిషేధం ఎత్తివేత

Yora Tade: ఫైనల్‌ మ్యాచ్‌లో తలపడుతూ మృత్యు ఒడిలోకి భారత కిక్‌ బాక్సర్‌

>
మరిన్ని వార్తలు