అతను మనోడు కాడు.. అథ్లెటిక్స్‌లో నీరజ్‌దే తొలి స్వర్ణం

8 Aug, 2021 07:55 IST|Sakshi
నార్మన్‌ ప్రిచర్డ్‌ , నీరజ్‌ చోప్రా

టోక్యో: 1900 పారిస్‌ ఒలింపిక్స్‌లో బ్రిటీష్‌–ఇండియన్‌ అథ్లెట్‌ నార్మన్‌ ప్రిచర్డ్‌ అథ్లెటిక్స్‌లో 2 రజత పతకాలు (200 మీ.పరుగు, 200 మీ.హర్డిల్స్‌) సాధించాడు. అయితే పేరుకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడని చెబుతున్నా, నాటి బ్రిటిష్‌ సామ్రాజ్య పాలనలో, స్వాతంత్య్రానికి 47 ఏళ్ల ముందు సాధించిన ఈ విజయానికి భారతీయత ఆపాదించడంలో అర్థం లేదు. అందుకే నీరజ్‌ సాధించిన స్వర్ణమే అథ్లెటిక్స్‌లో మన దేశానికి దక్కిన మొదటి పతకంగా భావించాలి.

నిజానికి అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఐఏఏఎఫ్‌) 2005లో ప్రచురించిన అధికారిక ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ గణాంకాల్లో  గ్రేట్‌ బ్రిటన్‌ తరఫునే ప్రిచర్డ్‌ పాల్గొన్నట్లుగా పేర్కొంది. అయితే అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) మాత్రం తమ ఒలింపిక్‌ పతకాల జాబితాలో ప్రిచర్డ్‌ ప్రదర్శనను భారత్‌ ఖాతాలోనే ఉంచింది!   

మరిన్ని వార్తలు